వన్డే వరల్డ్‌కప్-2023 కోసం భారత సెలెక్టర్లు ఇవాళ (సెప్టెంబర్ 5) టీమిండియాను ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం టీమిండియాను ప్రకటించిన అనంతరం రన్ మెషీన్ విరాట్ కోహ్లి పేరు ఒక్కసారిగా వైరలైంది. టీమిండియా చివరిగా గెలిచిన వన్డే వరల్డ్‌కప్‌లో (2011), 2023 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో కోహ్లి ఒక్కడే కామన్ సభ్యుడిగా ఉన్నాడన్న విషయాన్ని కోహ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో కోహ్లి అభిమానులు తమ ఆరాథ్య క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఓసారి భారత్‌ను జగజ్జేతగా నిలిపిన కోహ్లి, మచ్చటగా మూడోసారి భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా, ఇప్పటికే మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన విరాట్ కోహ్లిను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. 2023 వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలిస్తే, రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారతీయ క్రికెటర్‌గా విరాట్ చరిత్రపుటల్లోకెక్కుతాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్‌కు ఇది సాధ్యపడలేదు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతన్న ఆసియా కప్‌లో విరాట్ కోహ్లి ఫామ్ అంతంత మాత్రంగా ఉంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పేలవ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మరి మున్ముందు జరుగబోయే మ్యాచ్‌ల్లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి. ఒకవేళ అతను ఫామ్‌ను దొరకబుచ్చుకుంటే ప్రపంచకప్‌లో టీమిండియా విజయావకాశాలు బాగా మెరుగుపడతాయి. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో టీమిండియా ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా ఉంది. అదే కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తే టీమిండియాను ఆపడం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment