ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఎలా ఉండాలనే దానిపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాప్-6లో కనీసం ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను చూడాలనుకుంటున్నానని అన్నాడు. టీమిండియాలో సీనియర్లను (రైట్ హ్యాండ్) రీప్లేస్ చేసేంత లెఫ్ట్ హ్యాండ్ టాలెంట్ మన వద్ద ఉందని, ఇప్పటి నుంచే వారిలో కొందరిని సాన పెడితే ప్రపంచకప్ సమయానికంతా మెరికల్లా తయారవుతారని తెలిపాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో జట్టు సమతూకంగా మారుతుందని, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వకపోతే టీమిండియాకు చాలా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
ఓపెనర్లే కానక్కర్లేదు..
వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు బ్యాటింగ్ టాపార్డర్‌లో కనీసం ఇద్దరు లెఫ్ట్ బ్యాటర్లను చూడాలనుకుంటానన్న రవిశాస్త్రి.. ఆ ఇద్దరూ ఓపెనర్లే కానక్కర్లేదని తెలిపాడు. టాప్-4లో ఒకరు, టాప్-6లో ఇద్దరు అయితే జట్టు సమతూకంగా మారి, ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు.
యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్..
యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లని.. ఐపీఎల్‌లో వారిదివరకే ప్రూవ్ చేసుకున్నారని, వీరికి సీనియర్ల స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వీరే కాక నేహల్ వధేరా, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు కూడా లైన్‌లో ఉన్నారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీరిని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తే టీమిండియా బెంచ్ స్ట్రెంగ్త్ పటిష్టంగా ఉంటుందని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment