
ఐసీసీ వరల్డ్ కప్ టూర్‌వన్డే ప్రపంచకప్
గచ్చిబౌలి: ఐసీసీ వరల్డ్ కప్ టూర్‌లో భాగంగా ‘వన్డే ప్రపంచకప్’ హైదరాబాద్‌కు చేరుకుంది. గచ్చిబౌలిలోని నిస్సాన్ షోరూమ్‌లో అభిమానుల సందర్శనార్థం ఈ ట్రోఫీని ఉంచారు. నటి వర్షిణి సౌందరాజన్ ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ట్రోఫీతో పాటు న్యూ నిస్సాన్ కిక్స్ కారును ఆమె ప్రీలాంచ్ చేశారు.
ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ... 2019 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్ నిస్సాన్ షోరూమ్ ఎండీ సిరాజ్ బాబూఖాన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఐసీసీ వరల్డ్ కప్ మెగా టోర్నీకి నిస్సాన్ కంపెనీ అధికారిక భాగస్వామిగా ఉందని చెప్పారు. మన రోడ్లకు అనుగుణంగా న్యూ నిస్సాన్ కిక్స్ కారును రూపొందించారని తెలిపారు. వచ్చే సంక్రాంతి నాటికి భారత మార్కెట్‌లోకి ఈ కారు అందుబాటులోకి వస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment