గతేడాది జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లమెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ హెల్త్‌పై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరో 9 నెలల సమయం (2024 జనవరి) పట్టొచ్చని తెలుస్తోంది. ఆ సమయానికైనా పంత్ కోలుకున్నాడంటే అది చాలా వేగవంతమైన రికవరీ అని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యలో అతను సెప్టెంబర్ నెలలో జరిగే ఆసియా కప్, అక్టోబర్, నవంబర్‌లలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్రల సాయంతో నడుస్తున్న పంత్.. ఏ సహాయం లేకుండా నడవాలంటేనే మరికొన్ని వారాలు పట్టొచ్చని తెలుస్తోంది.
వరల్డ్‌కప్‌లో పంత్‌కు ఆల్టర్నేట్ ఎవరు..?
వన్డే ప్రపంచకప్‌కు పంత్ అందుబాటులో ఉండడని దాదాపుగా తేలిపోయింది. మరి అతని ఆల్టర్నేట్ ఎవరన్నదే టీమిండియా అభిమానులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. సెలెక్టర్ల పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నప్పటికీ, ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రాక్ రికార్డు, వరల్డ్‌కప్ సమయానికి ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరుగుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో (2023) వివిధ జట్ల వికెట్‌కీపర్ల ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
వన్డే వరల్డ్‌కప్‌కు ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నారు. ఆతర్వాత కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే వినియోగించుకోవాలని సెలెక్టర్లు భావిస్తే, ఈ జాబితా నుంచి అతని పేరు తొలగిపోవచ్చు. కొత్తగా రేసులోకి జితేశ్ శర్మ (పంజాబ్), ప్రభ్‌సిమ్రన్ (పంజాబ్), అభిషేక్ పోరెల్ (ఢిల్లీ), ఎన్ జగదీశన్ (కేకేఆర్) పేర్లు వచ్చాయి. గుజరాత్ ఓపెనర్, వెటరన్ ప్లేయర్ సాహా అవకాశాలను కూడా తీసిపాడేయటానికి వీలు లేదు.
ప్రస్తుత ఫామ్ దృష్ట్యా వన్డే వరల్డ్‌కప్‌కు సాహా అయితేనే బెటర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ పూర్తిగా తేలిపోయాడు కాబట్టి, అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. వీరే కాక యువ వికెట్‌కీపర్లు సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ), ఉపేంద్ర యాదవ్ (సన్‌రైజర్స్), ధృవ్ జురెల్ (రాజస్థాన్), ఆనూజ్ రావత్ (ఆర్సీబీ), విష్షు వినోద్ (ముంబై) ఐపీఎల్‌లో తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. మరి ఫైనల్‌గా సెలెక్టర్లు ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment