
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అంధుల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 283 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 34.5 ఓవర్లలో ఛేదించింది.
దీపక్ మాలిక్ (71 బంతుల్లో 79), వెంకటేశ్ (55 బంతుల్లో 64), కెప్టెన్ అజయ్ రెడ్డి (34 బంతుల్లో 47) అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్ నిర్ణీత 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. జమీల్ (94 నాటౌట్), నిసార్ అలీ (63) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment