క్వార్టర్స్‌లో శ్రీలంక | srilanka entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీలంక

Published Mon, Feb 17 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

srilanka entered in quarter finals

అండర్-19 ప్రపంచకప్ టోర్నీ
 దుబాయ్: వరుసగా రెండో విజయం నమోదు చేసి శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు అండర్-19 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక వికెట్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించగా... దక్షిణాఫ్రికా 45 పరుగుల ఆధిక్యం తో కెనడాపై గెలిచింది.
 
  ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ట్రాటర్ (120 బంతుల్లో 95; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. అనంతరం శ్రీలంక 48.5 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సమర విక్రమ (89 బంతుల్లో 82; 10 ఫోర్లు)తో పాటు సుమన సిరి (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించారు. ఇతర మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ 112 పరుగులతో యూఏఈపై, వెస్టిండీస్ 167 పరుగులతో జింబాబ్వేపై గెలిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement