టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తాడని కార్తీక్ కొనియాడు. కాగా గత కొంత కాలంగా సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ఈ హైదారాబాదీ ప్రస్తుతం వన్డేల్లో ప్రపంచ నెం1 బౌలర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నడు. మొదటి టెస్టులో మహమ్మద్ సిరాజ్ తన స్పెల్‌తో ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. ఇక రెండో టెస్టులో స్పిన్నర్లు చెలరేగడంతో సిరాజ్‌కు బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు.
ఈ నేపథ్యంలో కార్తీక్ క్రిక్‌బజ్ షో రైజ్ ఆఫ్ న్యూ ఇండియాలో మాట్లాడుతూ.. "సిరాజ్ వన్డే ప్రపంచకప్ భారత జట్టులో ఖచ్చితంగా భాగమవుతాడు. అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో అదరగొడతాడని భావిస్తున్నాను.
అయితే గతేడాది ఐపీఎల్ సీజన్ అతడికి చాలా విషయాలు నేర్పించింది. వైఫల్యాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నాడు. అదే విధంగా అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తే.. కనీసం 300 టెస్టు వికెట్లు అయినా సాధిస్తాడు" అని కార్తీక్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు ఊహించని షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment