ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది.
ఫిఫా క్వాలిఫయర్స్‌లో గ్వామాపై విజయం
బెంగళూరు: ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. గురువారం గ్వామా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో భారత్ నెగ్గింది. ప్రథమార్ధం 10వ నిమిషంలోనే రాబిన్ సింగ్ గోల్ చేసి ఆధిక్యాన్ని అందించాడు.
41వ నిమిషంలో షెహనాజ్ సింగ్ రెడ్ కార్డుకు గురవ్వడంతో భారత్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే ఫైనల్ రౌండ్ బెర్త్‌కు దూరమైన భారత్ ఓవరాల్‌గా ఆడిన ఆరు క్వాలిఫై మ్యాచ్‌ల్లో ఇదే తొలి గెలుపు కావడం విశేషం.