రషీద్ ఖాన్
హరారే : వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. 44 మ్యాచుల్లోనే రషీద్ ఖాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 52 మ్యాచుల్లో ఈ ఘనత సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా తాజా మ్యాచ్‌తో రషీద్ ఖాన్ అధిగమించాడు. 23 ఓవర్ చివరి బంతికి విండీస్ ఆటగాడు షై హోప్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
ముస్తాక్ (పాకిస్తాన్) 53, షేన్ బాండ్ (న్యూజిలాండ్) 54, బ్రెట్‌లీ(ఆస్ట్రేలియా) 55 మ్యాచుల్లో ఈ ఘనతను అందుకోని తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక భారత్ నుంచి 59 మ్యాచుల్లో ఇర్ఫాన్ పఠాన్ ఈ ఫీట్‌ను సాధించి వకార్ యూనిస్(పాకిస్తాన్), మోర్కెల్(దక్షిణాఫ్రికా)లతో సమంగా 8వ స్తానంలో నిలిచాడు. ఇక రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment