ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్ ఓవర్‌లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో విండీస్ ఓటమి పాలైంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసినప్పటికి విజయం సాధించలేకపోయింది. విండీస్ బౌలర్లు విఫలం కావడంతో నెదర్లాండ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 374 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్‌లో తేల్చాల్సి వచ్చింది.
హోల్డర్ చెత్త బౌలింగ్.. వాన్ బీక్ సూపర్ బ్యాటింగ్
ఇక సూపర్ ఓవర్‌లో విండీస్ తరపున బౌలింగ్ వేసేందుకు బంతిని హోల్డర్‌కు కెప్టెన్ హోప్ అందించాడు. హోప్ నమ్మకాన్ని హోల్డర్ వమ్ము చేశాడు. హోల్డర్ వేసిన సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్ వాన్ బీక్ బౌండరీల మోత మోగించాడు. 4,6,4,6,6,4 బాదాడు. దీంతో సూపర్ ఓవర్లో డచ్ జట్టు ఏకంగా 30 పరుగులు చేసింది.
సూపర్ ఓవర్‌లో ఒక్క మంచి డెలివరీని కూడా హోల్డర్ సంధించలేకపోయాడు. ఫుల్ టాస్ లేదా సరైన స్లాట్‌లో బౌలింగ్‌లో చేయడంతో వాన్‌బీక్ బౌండరీల వర్షం కురిపించాడు. అనంతరం 31 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ ఘోర పరాభావాన్ని విండీస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. హోల్డర్‌కు బదులుగా జోషఫ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే కచ్చితంగా విండీస్ విజయం సాధించేదాని పోస్టులు చేస్తున్నారు. హోల్డర్ తన చెత్త బౌలింగ్‌తో విండీస్ కొంపముంచాడు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్‌లో కూడా అంతే..
ఇక హోల్డర్ గత కొంతకాలంగా తన స్ధాయికి తగ్గట్టు రాణించడంలో విఫలమవతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హోల్డర్.. 8 మ్యాచ్‌ల్లో 9.96 ఏకనామీతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ముఖ్యంగా ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. హోల్డర్ తొలి మూడు బంతులకే 3 సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు ఓటమి మిగిల్చాడు.
చదవండి: CWC Qualifiers 2023: చరిత్ర సృష్టించిన నెదార్లాండ్స్ ఆటగాడు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!
Jason Holder, the man, the myth, the legend! pic.twitter.com/5I8QrCoTfO
— Shivani Shukla (@iShivani_Shukla) June 26, 2023
Comments
Please login to add a commentAdd a comment