అంతర్జాతీయ వేదిక కొలంబియా యూనివర్సిటిలో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాత్మక మార్పులు ఫలితాన్నిస్తున్నాయి. విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులు అంతర్జాతీయ వేదికలపై విద్యార్ధుల రూపంలో ప్రతిబింబిస్తున్నాయి. ఎల్లలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలపై స్పెషల్ స్టోరీ.
పదిరోజుల అమెరికా పర్యటన కోసం న్యూయార్క్ చేరుకున్న ఏపీ విద్యార్ధుల బృందం మొదటి రోజు ఐక్యారాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ వీకెండ్ లో పాల్గొన్నారు. మరుసటి రోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అమెరికా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ లో జరుగుతున్న “ఎడ్యుకేట్ ఏ చైల్డ్”, US ట్రాన్స్ఫార్మింగ్, యూత్-లెడ్ ఇన్నోవేషన్, గ్లోబల్ సిటిజన్‌షిప్ ఎడ్యుకేషన్ సమ్మిట్ సెమినార్ లో యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ స్ధాయి విద్యావేత్తలు, ప్రొఫెసర్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల గురించి అంతర్జాతీయ వేదికపై మాట్లాడారు మన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు.
అందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత పెంచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన నాడు నేడు పథకం ద్వారా లబ్ధి పొంది చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్తున్నారు.
కొలంబియా యూనివర్సిటి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికా అయ్యాంగార్ నిరుపేదల విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం వైఎస్ జగన్ చేస్తున్న సేవలను కొనియాడారు. వైఎస్ జగన్ చేస్తున్న పేదరిక నిర్మూళన అందరికి విద్యా, వైద్యం కల్పిస్తున్న విధానం ఎంతో ఆకర్షించిందని ఆమె అన్నారు. కొలంబియా యూనిర్సిటి సెమినార్ లో పాల్గొన్న విద్యార్ధులు తాము భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్య ద్వారా అమెరికాలో చదువుకుంటామని తమ అభిప్రాయాన్ని కొలంబియా యూనివర్సిటిలో ప్రంపంచస్ధాయి విద్యావేత్తల ముందు చెప్పారు. దీనికి విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment