బోయినపల్లి : అంతర్జాతీయంగా పేరొందిన చిత్రకారుడు కరీంనగర్ జిల్లా బోరుునపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తోట వైకుంఠంపై కోల్‌కతాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు పార్థూరాయ్ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. వైకుంఠంతో కలిసి ఆయన స్వగ్రామమైన బూరుగుపల్లి వచ్చిన పార్థూరాయ్ శుక్రవారం వరకు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. వైకుంఠం చిత్రకారుడిగా రాణించడం వెనుక గ్రామీణ నేపథ్యం, కులవృత్తుల వారితో అనుబంధమే కీలకమైందని ఆయన చెబుతుంటారు. తన చిన్నతనంలో కమ్మరి కొలిమి, కుమ్మరి సార, నేతన్నల మగ్గం, గీతవృత్తి వంటి వాటితో స్ఫూర్తి పొంది పల్లె ప్రజల శ్రమైక జీవనమే నేపథ్యంగా ఎన్నో చిత్రాలు గీశారు. అలాగే చిన్నప్పుడు వైకుంఠం చిందుయక్షగానాన్ని అమితంగా ఇష్టపడేవారు. దీంతో గ్రామంలో చిందుకళాకారులు విరాటపర్వం నాటకాన్ని ప్రదర్శించారు. వీటన్నింటిని డాక్యుమెంటరీ రూపకల్పనలో భాగంగా చిత్రీకరించారు.
ఈ డాక్యుమెంటరీని నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయనున్నట్టు పార్థూరాయ్ తెలిపారు. మొదటి షెడ్యూల్ వైకుంఠం ప్రస్తుతం నివాసముంటున్న హైదరాబాద్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. రెండవ షెడ్యూల్‌ను బూరుగుపల్లిలో చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడవ షెడ్యూల్‌ను వైకుంఠం చిత్రకళ నేర్చుకున్న మహారాజ సయాజీరావు, యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో తీయనున్నట్లు చెప్పారు.
నాలుగవ షెడ్యూల్‌ను కోల్‌కతాలో మాభూమి చిత్ర దర్శకుడు గౌతంఘోష్‌తో వైకుంఠంకు ఉన్న అనుబంధంపై చిత్రీకరించనున్నట్లు ఆయన వివరించారు. మాభూమి చిత్రానికి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేసిన వైకుంఠంకు జాతీయ ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. 1942లో జన్మించిన వైకుంఠం 1960లో హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. తాజాగా స్వగ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు డప్పుచప్పుళ్లు, మేళతాళాలతో స్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. హోలీ సందర్భంగా రంగులు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తోట వైకుంఠంపై డాక్యుమెంటరీ
Published Sat, Mar 7 2015 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement