ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్ధ. ప్రపంచంలోని ముస్లిం యువతను ఆకర్షిస్తూ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతున్న ఈ సంస్థ వైపు యువతరం ఎందుకు ఆకర్షితులవుతున్నారు? ఈ అంశంపై ఆసక్తితో రామ్ జీ అనే ఫ్రెంచ్ జర్నలిస్టు ఫ్రాన్సులోని ఇస్లామిక్ సపోర్టర్లతో అనుబంధాన్ని పెంచుకుని 'అల్లా సోల్జర్స్' అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని తయారు చేశాడు. ఈ చిత్రం సోమవారం ఫ్రాన్స్ దేశంలో విడుదల కానుంది.
ఇస్లామిక్ స్టేట్ గురించి తెలుసుకోవాలంటే.. ఏం చేయాలి? అనే ప్రశ్న మొదట రామ్ జీ కి ఎదురయింది. అందుకు ఐఎస్ఐఎస్ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా సాధనాన్ని రామ్ కూడా ఉపయోగించి స్థానిక ఇస్లామిక్ సానుభూతిపరులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిని మొదట ఫ్రాన్స్ లోని చాటె ఆరెక్స్ అనే పట్టణంలో ఆ గ్రూప్ ( మొత్తం ఒక పెద్ద, 12 మంది యువకులు) కలిశారు. కలిసిన మరుక్షణంలోనే అబుహమ్జా అనే ప్రదేశంలో మానవబాంబు దాడి చేయాలని జర్నలిస్టును వాళ్లు కోరడం గమనార్హం.
అప్పుడు వాళ్లలో రామ్ కు కనిపించింది ఒకటే.. ఈ ప్రపంచాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. ఇది ఇస్లాంకు విరుద్ధం. సాధారణంగా ఇస్లాంను పాటించే వ్యక్తి ఇలా ఆలోచించడు. ఆ తర్వాతి సమావేశం ఒక మసీదు వద్ద ఏర్పాటు చేయగా.. పక్కనే ఉన్న ఎయిర్ పోర్టులో విమానాలను చిన్న రాకెట్ లాంచర్‌తో కూల్చివేయచ్చని చెప్పారు.
ఆ గ్రూప్ పెద్ద గతంలో ఐఎస్ఐఎస్ లో చేరాలని ప్రయత్నించగా టర్కీ పోలీసులు అరెస్టు చేసి ఐదు నెలలపాటు జైలులో పెట్టారు. విడుదలయ్యే రోజు ఎన్క్రిప్టెడ్ టెలిగ్రామ్ మెసేజ్ లను ఉపయోగించి దాడులు ఎక్కడెక్కడ చేయాలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జనవరిలో వీరి గ్రూప్ లోని ఇద్దరే చార్లీ హెబ్డో మ్యాగజైన్ మీద దాడి చేసి 12 మందిని చంపారు.
ఈ అంశాలన్నింటినీ హిడెన్ కెమెరాతో చిత్రీకరించిన రామ్ ఈ సోమవారం డాక్యుమెంటరీని పారిస్ లో ప్రదర్శించనున్నారు.
జీహాదీలుగా ఎలా మారుతున్నారు..?
Published Mon, May 2 2016 7:11 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement