మా అమ్మ పాట జానపదాల పూదోట | ASAMANA ANASUYA: Documentary film directed by Seetha Ratnakar, is a daughters tribute to her mother | Sakshi
Sakshi News home page

మా అమ్మ పాట జానపదాల పూదోట

Published Thu, Aug 8 2024 4:05 AM | Last Updated on Thu, Aug 8 2024 8:06 AM

ASAMANA ANASUYA: Documentary film directed by Seetha Ratnakar, is a daughters tribute to her mother

‘అసమాన అనసూయ’... ఇదీ తెలుగు జానపద సంగీత సామ్రాజ్ఞి వింజమూరి అనసూయాదేవి పై ఆమె కుమార్తె సీతా రత్నాకర్‌ రూపొందించిన డాక్యుమెంటరీ పేరు. గంటన్నర నిడివి గల ఈ డాక్యుమెంటరీ వింజమూరి అనసూయాదేవి గాత్రాన్ని, ఘనతను, అనుభవాలను ్ర΄ోది చేసింది. దేశ విదేశాలఫెస్టివల్స్‌లో ప్రశంసలు పొందుతోంది. ఆగస్టు 11న కాకినాడలో, ఆగస్టు 17న హైదరాబాద్‌లో ప్రదర్శితం కానున్న ఈ డాక్యుమెంటరీ గురించి సీతా రత్నాకర్‌ తెలిపిన వివరాలు.

‘దూరదర్శన్‌లో పని చేస్తున్న సమయంలో నేను కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. అయితే జానపద సంగీత విభాగంలో గొప్ప కృషి చేసిన మా అమ్మ మీద డాక్యుమెంటరీ తీసే ఉద్దేశం నాకు అప్పట్లో ఉండేది కాదు. మా అమ్మ 1990 తర్వాత అమెరికా లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు అందరి మీద డాక్యుమెంటరీలు‡ తీస్తున్నావ్‌ మరి నా మీద ఎప్పుడు తీస్తావు అని అడిగింది. అవును కదా అనుకున్నాను. అయినా సరే ఆ పనికి శ్రీకారం చుట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది’ అని గుర్తు చేసుకున్నారు సీతా రత్నాకర్‌. 

ఆమె తన తల్లి వింజమూరి అనసూయ పై తీసిన డాక్యుమెంటరీ ‘అసమాన అనసూయ’ ఇప్పుడు వివిధ దేశాలలో జరుగుతున్న ఫెస్టివల్స్‌లో పాల్గొంటోంది. కోల్‌కతా చలన చిత్ర ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో 2024 సంవత్సరానికి ప్రథమ బహుమతి  పొందింది.  తాజాగా ఈ డాక్యుమెంటరీని ఆగస్టు 11న కాకినాడ సూర్యకళామందిరంలో, ఆగస్టు 17న హైదరాబాద్‌  బంజారాహిల్స్‌లోని సప్తపర్ణిలో ప్రదర్శించనున్నారు.

డాక్యుమెంటరీ విలువ తెలిసింది
‘మా అమ్మ అమెరికాలో ఉన్నప్పుడు మా అక్క భర్త ఆమె అనుభవాలను నమోదు చేసిన టేప్‌ ఫుటేజ్‌ ఉంది. నేను డాక్యుమెంటరీ కోసం ప్రత్యేకంగా అమ్మతో మాట్లాడాలనుకునేలోపు ఆమె 2019లో స్వర్గస్తురాలయింది. ఆమెపై డాక్యుమెంటరీ అవసరం ఆమె ΄ోయాక గానీ పూర్తిగా నాకు తెలియరాలేదు. వెంటనే రంగంలో దిగాను. కరోనా మొదటి రెండేళ్ల సమయంలో ఫుటేజ్‌ మొత్తం గేదర్‌ చేసుకుని పని ్రపారంభించాను. పాత టేప్‌ ఫుటేజ్‌ అంతా డిజిటలైజ్‌ చేయించాను. ఆ తర్వాత దాన్ని అంతటినీ గుదిగుచ్చి 94 నిమిషాల డాక్యుమెంటరీ తయారు చేశాను. మా అమ్మ జీవితాన్ని తెలుసుకోడం అంటే స్వాతంత్య్రానికి 20 ఏళ్ల పూర్వం నుంచి ఆ తర్వాత సినిమా, రేడియో, ఇతర మాధ్యమాల తెలుగు సంగీత చరిత్రను తెలుసుకోవడమే’ అని తెలిపారు సీతా రత్నాకర్‌.

జానపదం అమ్మపాట... బాట
‘మా అమ్మ వింజమూరి అనసూయాదేవి 1920 మే 12 తేదీన కాకినాడలో జన్మించింది. మా అమ్మకు బాల్యం నుండే సంగీతం పట్ల మక్కువ కలిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే గ్రాంఫోన్‌ రికార్డు పాడిన ఘనత ఆమెది. అప్పటినుంచి ఆమె తన మేనమామ, ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రితో పాటల ప్రయాణం చేస్తూ ఎన్నో పాటలకు ్రపాణం ΄ోసింది. అయితే ‘జానపదం’ అంటేనే ఆమెకు మక్కువ. ‘బండీర ΄÷గ బండీర’, ‘గోలకొండోయి గొరుగాకు పుల్ల’, ‘రామనా సందనాలో’, ‘గోదారోరి సిన్నది’, ‘కొండండోరి సెరువుల కింద’, ‘హోలీ హోలీయరంగ హోలీ’, ‘గోదావరి ్రపాంత పెళ్లి పాటలు’– మొదలైన వందలాది తెలుగు జానపదాలను రేడియో ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ, కచేరీల స్థాయికి తీసుకువెళ్లడంలో ఆమెది పెద్ద పాత్ర’ అంటారు సీతా రత్నాకర్‌.

మొక్కజొన్న తోటలో...
‘మా అమ్మ తన చెల్లి సీతతో కలిసి వింజమూరి సిస్టర్స్‌గా ఎన్నో కచేరీలు చేసింది. దేవులపల్లి రాసిన  ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ’కి బాణీ ఏర్పరచి కాకినాడ పి.ఆర్‌. కళాశాల స్వర్ణోత్సవ సభలో(1935) పిల్లలతో పాడించింది. కొనకళ్ళ‘మొక్కజొన్న తోటలో’ పాటకి ్రపాణం ΄ోసింది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ పాల్గొన్న కాకినాడ టౌన్‌ హాల్‌ సభలో ఆయన పక్కన కూర్చుని దేశభక్తి గీతాలు పాడటం ఆమె ఎప్పుడూ మర్చి΄ోలేదు’ అని గుర్తు చేసుకున్నారామె.

నేను రెండో కుమార్తెను
‘నేను అమ్మకు రెండో కుమార్తెను. చెన్నైలో స్థిరపడ్డాను. మా అక్క రత్నపాపతో కలిసి అమ్మ కచేరీలలో కోరస్‌ పాడేదాన్ని. ఆ తర్వాత దూరదర్శన్‌ లో ్ర΄ోగ్రాం ప్రొడ్యుసర్‌గా నాలుగు దశాబ్దాలు పనిచేసి 2012లో పదవీ విరమణ చేశాను. 2014లో నుంచి ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ మొదలుపెట్టాను. నేను తీసిన ‘కాస్మిక్‌ కనెక్షన్‌’ డాక్యుమెంటరీకి దేశ విదేశ పురస్కారాలు వచ్చాయి. ‘అసమాన  అనసూయ’ డాక్యుమెంటరీకి దేశ విదేశాలలో గుర్తింపు వస్తోంది. అయితే తెలుగువారే దానిని ఎక్కువ చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారామె.

– సాక్షి ఫ్యామిలీ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డా.కె.రామచంద్రారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement