సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత ఆధ్యాతి్మక వేత్త మొరారి బాపు ఇటీవల తాను చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ రామకథా యాత్రపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన బాపు, ఆయన బృందం దీనిని చిత్రీకరించిందనీ, మంచు కప్పేసిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు విశాలమైన సముద్ర తీరాల వరకూ సాగిన ఈ యాత్రలో అనేక ఆధ్యాతి్మక విశేషాలను వీక్షించవచ్చని రూపకర్తలు తెలిపారు. అదే విధంగా బాపు రచించిన జర్నీ విత్ యాన్ ఇని్వజబుల్ పవర్, సాక్ర్‌డ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ పుస్తకాలు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment