తుళ్లూరు: రైతుల భూములను చూపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం మండల కేంద్రమైన తుళ్లూరులోని స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏపీసీఆర్‌డీఏ, ఏడీసీ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది. అయితే ప్రపంచ బ్యాంకుకు రైతుల అభిప్రాయాలను డాక్యుమెంటరీ రూపంలో అందజేసేటప్పుడు రాజధాని ప్రాంత రైతులకు ముందస్తు సమాచారం ఇవాల్సి ఉంటుంది.
రైతులందరూ ఎక్కడ తమ సమస్యలు చెప్పుకుంటారోననే ఆందోళనతో గుట్టుచప్పుడుగా, తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు రైతులతో మాట్లాడించి హడావుడిగా ముగించేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని రైతులు తమకు సమాచారం ఇవ్వకుండా డాక్యుమెంటరీకి అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని మండిపడుతున్నారు. తొలుత తమ భూములకు çసంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో తమ భూములతో ప్రభుత్వం రుణాలు పొందాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment