న్యూఢిల్లీ: ‘వలస కార్మిక సోదరీసోదరులారా.. దేశ బలం మీరే. దేశ భారాన్ని మీ భుజాల మీద మోస్తున్నారు. మీకు న్యాయం జరగాలని దేశం మొత్తం కోరుకుంటోంది. దేశ బలాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత’ అంటూ వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన డాక్యుమెంటరీలో దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధైర్యం నూరిపోశారు. (‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ)
వలస కార్మికుల కష్టాలను తెలుసుకొనేందుకు గత వారంలో రాహుల్ వారి వద్దకు వెళ్లి మాట్లాడిన వీడియో ఫుటేజీల నుంచి ఈ డాక్యుమెంటరీని తయారు చేశారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది వలస కార్మికుల ఖాతాలకు రూ. 7500 జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలస కార్మికులు పడుతున్న కష్టాలను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపారు.
Watch this short film in which I speak with India’s real nation builders, our migrant brothers & sisters. https://t.co/As99mjVvyt
— Rahul Gandhi (@RahulGandhi) May 23, 2020
Comments
Please login to add a commentAdd a comment