డబ్బుల్లేకే.. ఈ మార్గం పట్టా! | took to prostitution after running out of money, reveals shweta basu prasad | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేకే.. ఈ మార్గం పట్టా!

Published Thu, Sep 4 2014 1:30 AM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

డబ్బుల్లేకే.. ఈ మార్గం పట్టా! - Sakshi

డబ్బుల్లేకే.. ఈ మార్గం పట్టా!

వ్యభిచారంలోకి దిగడంపై సినీ నటి శ్వేతాబసు ప్రసాద్
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను వ్యభిచారంలోకి దిగానని సినీ నటి, ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఫేం శ్వేతాబసు ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. కొన్ని పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ ఇబ్బందుల్లో కూరుకుపోయినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు పోలీసుల రైడింగ్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు... సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఆంజనేయులు అలియాస్ బాలును, విటులను జైలుకు తరలించారు. అయితే తాను వ్యభిచారం చేయడానికి ఆర్థిక పరిస్థితులే కారణమని శ్వేతాబసు చెప్పినట్లు పోలీసువర్గాల సమాచారం.
 
‘‘నేను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను. నా కుటుంబానికి, కొన్ని మంచి పనుల కోసం డబ్బు అవసరమైంది. కానీ నాకు డబ్బు వచ్చే అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. అలాంటి సమయంలో వ్యభిచారం చేయాలంటూ కొందరు నన్ను ప్రోత్సహించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మరో మార్గం కనిపించక.. అందులోకి దిగాల్సి వచ్చింది...’’ అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement