రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది? | Shweta basu prasad to spend three months in rescue home | Sakshi
Sakshi News home page

రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది?

Published Fri, Sep 5 2014 10:50 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది? - Sakshi

రెస్క్యూహోంలో శ్వేతా బసు ఏం చేస్తోంది?

ఒక్క సినిమా.. 'కొత్త బంగారు లోకం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. వ్యభిచారం కేసులో పట్టుబడిన ఆమె మూడు నెలల పాటు రెస్క్యూ హోంలోనే గడపాల్సి ఉంటుంది. గతంలో కొంతమందిని ఇలాగే రెస్క్యూ హోంకు పోలీసులు తరలించినా.. కొన్నాళ్లు అక్కడ ఉండి అక్కడినుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే శ్వేతా బసు మాత్రం అలా కాకుండా.. ఏమాత్రం దిగులు పడకుండా బాగానే ఉందని సమాచారం. సాధారణంగా అక్కడకు వెళ్లినవాళ్లు.. అందులోనూ కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్లయితే విపరీతమైన డిప్రెషన్లో పడిపోతారు. కానీ శ్వేతా బసు మాత్రం అలా లేదట.

గత ఆదివారం నాడు పట్టుబడిన ఆమెను సోమవారం పోలీసులు ఎర్రమంజిల్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆమెను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించడంతో అక్కడికి తరలించారు. రెస్క్యూ హోంలో ఉన్న శ్వేతా బసు.. ఎంచక్కా తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి విషయాలు తెలుసుకుంటూ మామూలుగానే ఉందని తెలుస్తోంది. అక్కడ ఉన్నవాళ్లను కూడా పలకరిస్తూ.. వాళ్ల విశేషాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement