కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్‌ | Sonu Sood Visits Kumari Aunty Food Stall | Sakshi

సోనూసూద్‌కు ఫ్రీగా భోజనం పెడతానన్న కుమారి ఆంటీ

Jul 5 2024 12:24 PM | Updated on Jul 5 2024 1:20 PM

Sonu Sood Visits Kumari Aunty Food Stall

ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారిన పేరు కుమారి ఆంటీ. ఈవిడ భోజనం వడ్డిస్తే ఆహా ఏమి రుచి.. అనరా మైమరిచి.. అనుకుంటూ లొట్టలేసుకు తినాల్సిందే! తన చేతివంట రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. హైదరాబాద్‌ నగరంలో రోడ్డు పక్కన చిన్నపాటి హోటల్‌ పెట్టి వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాలను అమ్ముతూ చేతినిండా సంపాదిస్తోంది. యూట్యూబ్‌లో మార్మోగిపోయిన కుమారి ఆంటీ దగ్గరికి ఆ మధ్య హీరో సందీప్‌ కిషన్‌ కూడా వెళ్లొచ్చాడు.

తాజాగా నటుడు సోనూసూద్‌ ఆమె ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించాడు. తనను కలిసి బిజినెస్‌ ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నాడు. కుమారి ఆంటీ స్త్రీ శక్తికి తార్కాణం. కష్టపడితే ఫలితం ఉంటుందన్నదానికి ఈవిడే నిదర్శనం అని పేర్కొన్నాడు. స్వయంకృషితో ఎదిగే ఇలాంటివారిని సపోర్ట్‌ చేద్దామని తెలిపాడు.

నేను వెజ్‌ తింటాను.. నాకు డిస్కౌంట్‌ ఎంతిస్తావని సోనూసూద్‌ అడగ్గా కుమారి ఆంటీ ఫ్రీగా ఇస్తానంది. ఎంతోమందిని కష్టకాలంలో ఆదుకున్నారు.. ఇంకెంతోమందికి సాయం చేస్తూనే ఉన్నారు.. అలాంటి మీకు ఏమిచ్చినా తక్కువే అని కుమారి ఆంటీ అనడంతో సోనూసూద్‌ సంతోషపడ్డాడు. అనంతరం ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు.

కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించిన సోనూసూద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement