![Vikram’s daughter Akshita marries M. Karunanidhi’s great grandson Manu Ranjith.](/styles/webp/s3/article_images/2017/10/31/vikram.jpg.webp?itok=k3T_XlGu)
విక్రమ్‌కు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉందా?... చాలామంది ప్రేక్షకులకు సోమవారం చిన్నపాటి స్వీట్ షాక్ తగిలింది! కానీ, నమ్మక తప్పదు. ఎప్పుడూ యంగ్‌గా కనిపించే విక్రమ్.. నిన్నే తన కూమార్తె అక్షిత పెళ్లి చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మునిమనవడు మనోరంజిత్, అక్షిత కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నారట! ఇరువురి కుటుంబ సభ్యులు ప్రేమకు పచ్చ జెండా ఊపడంతో నిన్న పెళ్లి పీటలు ఎక్కారు. చెన్నైలోని గోపాలపురంలో గల కరుణానిధి నివాసంలో తమిళ సాంప్రదాయం ప్రకారం చాలా నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి కరుణానిధి, విక్రమ్‌ల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment