Altruistic
-
‘అట్రాసిటీ’పై దేశవ్యాప్త ఉద్యమం : మందకృష్ణ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పరిరక్షణ సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓయూ అతిథి గృహంలో జరిగిన మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న చట్టంలో ఎటువంటి మార్పులు చేసినా సహించేది లేదన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 17న ఢిల్లీలో సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు మందకృష్ణ వెల్లడించారు. -
మోడీ నిస్వార్ధ ప్రధాని
కోల్కతా: దివంగత పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా సతీమణి రాజశ్రీ బిర్లా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఆయన నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, నిస్వార్ధమైన అజెండాతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోడీపై అంతా ఆశలు పెట్టుకున్నారని ఎంసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. గత పదేళ్లలో అన్నీ ఎక్కడివక్కడే నిల్చిపోయాయని, దేనిపైనా ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని రాజశ్రీ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ సరైన దిశలోనే వెడుతున్నారని, ఆయనకు అంతా సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం కూడా ప్రధాని తోడ్పాడు అందిస్తున్నారన్నారు.