భామిని: మాదిగలకు ఇచ్చిన హామీని విస్మరించిన నమ్మకద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మాదిగల జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వస్తే మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిన బాబు గద్దెనెక్కిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. మాదిగలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన చంద్రబాబు స్వస్థలం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మాదిగ గర్జన చేయనున్నట్టు చెప్పారు.
ఏప్రిల్ 10న విజయవాడలో మహా సంగ్రామం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మాదిగలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాదిగలకు న్యాయం కోసం టీడీపీ వెంట తిరిగి తీవ్రంగా నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు, బత్తిలి సర్పంచ్ టింగ అన్నాజీరావు, వైఎస్‌ఆర్ సీపీ మండల అధ్యక్షుడు తోట సింహాచలం, జిల్లా నాయకులు సాసుపిల్లి ప్రకాశరావు, భామిని సర్పంచ్ పొట్నూరు దేవి, జిల్లా ఉపాధ్యక్షులు కానుకుర్తి శంకరరావు, మండల నాయకులు లోపింటి జయరాజు, కవిటి కృష్ణమూర్తి, డీసీసీబీ డెరైక్టర్ బైరి గోపీనాథ్, మాజీ సర్పంచ్ లోపింటి అప్పారావు పాల్గొన్నారు.
నమ్మకద్రోహి బాబు
Published Thu, Mar 3 2016 12:01 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement
Advertisement