విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని అభివర్ణించారు. బాబు నమ్మక ద్రోహి అని విమర్శించారు. గురువారం విశాఖపట్నంలోని ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరపకుండా నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై మందకృష్ణ మండిపడ్డారు.
మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. మాదిగలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మార్చి10వ తేదీ నుంచి మాదిగల మహా విశ్వరూప యాత్ర తలపెట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఊరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెల నుంచి ప్రారంభమవుతుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు.