'బాబు పచ్చి మోసగాడు' | MRPS National Leader Pilli Manikyala Rao fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

'బాబు పచ్చి మోసగాడు'

Published Fri, Aug 28 2015 3:41 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

MRPS National Leader Pilli Manikyala Rao fires on CM Chandrababu

నెల్లూరు (వింజమూరు) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాల రావు విమర్శించారు. వింజమూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాబు తన కపట బుద్ధితో ఎన్టీఆర్, మంద కృష్ణ మాదిగలను మోసం చేశాడని అన్నారు.

బాబు అంత మోసగాడు భారతదేశంలో ఎవరూ లేని అన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌కు ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కని, హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement