సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్... హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో భారతి అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సోమవారం సభలో మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అర్హులుంటే భారతి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఒకవేళ పిల్లలుంటే ప్రభుత్వ ఖర్చుతో చదివిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో భారతి భౌతిక కాయంపై ఎమ్మార్పీఎస్ పతాకాన్ని కప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ఉస్మానియా ఆస్పత్రిలోని ఆమె భౌతిక కాయాన్ని చూసి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. భారతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment