
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య ( హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల) నియామకమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment