యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.
పాత సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్‌బీఐ ప్రస్థానం!
ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్‌ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్‌లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment