టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.
నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్‌వే సిస్టమ్‌ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్‌ఫ్రీ పేమెంట్ గేట్‌వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.
నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది.
యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా?
- మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు.
- అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం.
- డబ్బు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి.
- యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment