బ్రిటన్‌ పార్లమెంటుపై సైబర్‌ దాడి | Cyber attack on Britain Parliament | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ పార్లమెంటుపై సైబర్‌ దాడి

Published Sun, Jun 25 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

Cyber attack on Britain Parliament

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటుకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌పై సైబర్‌ దాడి జరిగింది. శుక్రవారం రాత్రి తమ అధికారిక పార్లమెంటు ఈమెయిల్‌ ఖాతాలను తెరవలేకపోయామని పలువురు ఎంపీలు తెలిపారు. యూజర్ల ఖతాల్లో ప్రవేశించడానికి హ్యాకర్లు యత్నించినట్లు గుర్తించామని దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ప్రతినిధి చెప్పారు.  

నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌తో కలసి తమ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ భద్రతను పెంచుతున్నామని చెప్పారు. బలహీనమైన పాస్‌వర్డ్‌లను గుర్తించేందుకు హ్యాకర్లు అన్ని ఖాతాలపైనా దాడికి దిగినట్లు పార్లమెంట్‌ డిజిటల్‌ సర్వీసుల బృందం సమాచారం అందజేసింది. బ్రిటన్‌ ఎంపీలు, అధికారుల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సైబర్‌ దాడి జరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement