భారీ సైబర్‌ దాడి.. వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాక్‌ | Canada Government Accounts Hacked | Sakshi

భారీ సైబర్‌ దాడి.. వేలాది ప్రభుత్వ ఖాతాలు హ్యాక్‌

Aug 16 2020 11:42 AM | Updated on Aug 16 2020 2:38 PM

Canada Government Accounts  Hacked - Sakshi

పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్‌కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

టొరంటో: కెనాడాలో భారీ సైబరీ దాడి జరిగింది. ఆన్‌లైన్‌ ప్రభుత్వ సేవాలకు సంబంధించిన వేలాది ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 30 సమాఖ్య విభాగాలు, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలు ఉపయోగించే జీసీకీ(GCKey)సేవను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని ట్రెజరీ బోర్డ్ ఆఫ్ కెనడా సెక్రటేరియట్ ఒక పత్రికా ప్రకటనలో వివరించింది. 9,401 మంది జీసీకీ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారని గుర్తించామని, అన్నింటిని వెంటనే తొలగించామని కెనడా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అలాగే 5,500 రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి చేశారని, హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లను వెంటనే గుర్తించి తొలగించామని చెప్పారు. 
(చదవండి : టిక్‌టాక్‌.. అమెరికా ఆస్తులను అమ్ముకోండి)

పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్‌కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. కాగా, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలతో సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ సమాచారం మార్చబడిందని ఆగస్ట్‌ మొదటి వారంలోనే చాలా మంది కెనెడియన్లు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోనేట్లు తెలుస్తోంది. ఫలితంగా కరోనావైరస్‌ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిచిన ఆర్థిక సాయం అర్హులకు అందకుండా పోయిందని ఆ దేశ మీడియా పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement