ఆ వార్తతో మాకు సంబంధం లేదు’ | We do not relate to that news' | Sakshi
Sakshi News home page

ఆ వార్తతో మాకు సంబంధం లేదు’

Jan 11 2018 1:33 AM | Updated on Jan 11 2018 1:33 AM

We do not relate to that news' - Sakshi

హైదరాబాద్‌: ఆధార్‌ సమాచారానికి సరైన భద్రత లేదనీ, సైబర్‌ దాడి జరిగితే ఊహించని నష్టం జరుగుతుందంటూ బుధవారం మీడియాలో వచ్చిన వార్తకు, తమకు ఏ సంబంధం లేదని ఆర్‌బీఐ అనుబంధ ఐడీఆర్‌బీటీ (ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నీలజీ) చెప్పింది.

కొన్ని మీడియా సంస్థలు ఆ వార్తలోని అంశాలను ఆర్‌బీఐ పరిశోధకులకు అపాదించాయనీ, సదరు నివేదికతో ఆర్‌బీఐకిగానీ, తమకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నివేదిక తయారుచేసిన అధ్యాపకుడు ఎస్‌ అనంత్‌ తమ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా మాత్రమే పనిచేస్తున్నారని ఐడీఆర్‌బీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement