వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్‌ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.
ఎస్పీ ఓస్వాల్‌ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు.
సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.
ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment