గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం కంపెనీల కార్యకలాపాలన్నీ రిమోట్‌గానే నడిచాయి. దీంతో దేశంలో 45 శాతం సైబర్ క్రైం పెరిగాయని, ఈ ఏడాది 22శాతానికి పెరిగినట్లు వెరిజోన్ మొబైల్ సెక్యూరిటీ ఇండెక్స్-2022 నివేదిచింది.
సైబర్ దాడుల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది. మూడు నుంచి ఐదు కంపెనీల వరకు 61 శాతం దెబ్బతిన్నాయని, 43 శాతం దేశీయ సంస్థలపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేరాలు ముఖ్యంగా ఆర్థిక సేవల్లో 93 శాతం, రిటైల్ 88 శాతం, ఆరోగ్య సంరక్షణ 87 శాతం, ప్రభుత్వ రంగం, విద్య 87 శాతం, తయారీ, నిర్మాణం, రవాణా రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
ఈ సందర్భంగా వెరిజోన్ బిజినెస్ సీఈఓ సంపత్ సౌమ్యనారాయణన్ మాట్లాడుతూ..రిమోట్ వర్క్ కారణంగా సంస్థలు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా లేవని అన్నారు. కాబట్టే సైబర్ దాడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment