sperm donation
-
12 దేశాల్లో నూరుమందికి పైగా పిల్లలు : టెలిగ్రాం సీఈవో సంచలన ప్రకటన
ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్, టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశాడు. తనకు 12 దేశాలలో వంద మందికి పైగా పిల్లలు ఉన్నారంటూ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించడం చర్చకు దారి తీసింది. “బయోలాజికల్ పిల్లలు” ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వేదికపై పంచుకున్నాడు. స్పెర్మ్ డొనేషన్ పై ఉన్న అపోహలను, వ్యతిరేకతనుతొలగించేందుకు ఈ పోస్ట్ పెడుతున్నా అంటూ కొన్ని సంగతులను షేర్ చేశాడు. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను 1.8 మిలియన్ల మంది వీక్షించారు. స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తండ్రిని అంటూ తన సుదీర్ఘమైన పోస్ట్‌లో వెల్లడించాడు. అంతేకాదు తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా గుర్తించే వీలుగా తన డిఎన్ఎను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని ప్రకటించాడు. స్మెర్ప్ డోనర్ ఎలా అయ్యాడుపెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా జీవనం సాగిస్తున్న తాను 100మందికి తండ్రిని ఎలా అయ్యిందీ, తాను స్పెర్మ్ డోనర్గాఎలా మారిందీ ఆ పోస్ట్‌లో వివరించాడు. తనకు వందకు మందికి పైగా బయోలాజికల్ పిల్లలు ఉన్నారని ఈ మధ్యనే తెలిసిందని రాసుకొచ్చాడు.‘‘పదిహేనేళ్ల క్రితం నా స్నేహితుడు ఓ విచిత్రమైన రిక్వెస్ట్ తో నా దగ్గరకు వచ్చాడు. సంతానోత్పత్తి సమస్య కారణంగా తనకు, తన భార్యకు పిల్లలు పుట్టలేదని, తమకు బిడ్డ బిడ్డ పుట్టడానికి క్లినిక్ లో నా వీర్యాన్ని దానం చేయాలని కోరాడు. తను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, నేను గట్టిగా నవ్వేశాను. కానీ, అతడు సీరియస్ గానే ఆ రిక్వెస్ట్ చేశాడు’’ అని టెలిగ్రామ్ తెలిపాడు."హై-క్వాలిటీ డోనర్ మెటీరియల్" కొరత ఉందని , స్పెర్మ్ దానం ద్వారా ఎక్కువ మంది జంటలకు సహాయం చేయడం పౌర కర్తవ్యమని చెప్పారని వెల్లడించాడు. ఈ క్రమంలోనే వీర్యదానం చేయడానికి క్లినిక్‌ను సందర్శించినప్పుడు, అత్యంత-నాణ్యత కలిగిన వీర్యం అని తేలిందట. వీంతో ఇబ్బడి ముబ్బడిగా రిక్వెస్ట్‌లు రావడం మొదలయ్యాయి. మొదట్లో ఇదంతా విచిత్రంగా అనిపించినా, తరువాత ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నానని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తాను వీర్య దాతగా ఉండటం మానేశానని చెప్పాడు. అయితే ఐవీఎఫ్ క్లినిక్‌లో ఫ్రీజ్ చేసిన తన వీర్యం అందుబాటులో ఉందని వెల్లడించాడు. పిల్లలను పొందాలనుకునే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించాడు. భవిష్యత్తులో తన బయోలాజికల్ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఉపయోగ పడేందుకు వీలుగా తన డీఎన్ఏ ను ఓపెన్ సోర్స్ చేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు.ఎవరీ పావెల్ దురోవ్రష్యా నుండి పారిపోయిన పావెల్ ఆ తర్వాత సోషల్ నెట్వర్క్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ ఒకదాన్ని లాంచ్ చేశాడు. అందుకే అతనిని ‘రష్యా మార్క్ జుకర్‌బర్గ్" అని పేరు పొందాడు. ఆ కంపెనీ నుంచి తొలగించడంతో ఆ తరువాత టెలిగ్రామ్‌ను స్థాపించాడు. దురోవ్ తన ప్రత్యేకమైన జీవనశైలితో పాపులర్. అతను నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తాడు. -
‘స్పెర్మ్ డొనేషన్’తో జన్మించిన ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి?
లోకంలోని ప్రతీ చిన్నారి తన తల్లిదండ్రుల అండ కోరుకుంటుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలల జీవితంలో ఎప్పుడూ శూన్యం తాండవమాడుతుంటుంది. అట్లాంటాకు చెందిన టిఫనీ జీవితంలో కూడా అటువంటి శూన్యతే ఏర్పడింది. ఆమె తన నాలుగేళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇదే విషయాన్ని ఆమెకు తరచూ చెప్పేది. అయితే ఆమెకు చాలాకాలానికి తండ్రి గురించిన నిజం తెలియడంతో నివ్వెరపోయింది. మిర్రర్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ తన నిజమైన తండ్రిని మిస్సయ్యింది. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. తరువాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరయ్యింది. అయితే తన అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది. 2018లో టిఫనీ 36వ పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది. టిఫనీ ఇన్నాళ్లూ ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో, అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది. తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది. అంతే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని, తన తల్లి ఎవరినుంచో స్పెర్మ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థం అయ్యింది. టిఫనీ తల్లి మొదటి భర్త.. టిఫనీని సొంత కూతురులా చూసుకున్నాడు. టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. టిఫనీ 1982లో జన్మించింది. ఇటీవల టిఫనీ డీఎన్ఏ పరీక్ష చేయించుకుంది. దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది. అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా, ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు. ఇదేవిధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి. ప్రస్తుతం టిఫనీకి 41 ఏళ్లు. 17 ఏళ్ల క్రితం టిఫనీకి వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. -
హృతిక్‌రోషన్ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి
చెన్నై,పెరంబూరు: అన్నదానం, రక్తదానం, నేత్రదానం దాటి ఇప్పడు వీర్యదానం వరకూ వచ్చింది. ఒక ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి బాలీవుడ్ క్రేజీ నటుడు హృతిక్‌రోషన్ వీర్యదానం చేయాలన్న డిమాండ్‌ను వ్యక్తం చేసింది. అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్ క్రీడాపోటీల్లో పాల్గొన్న భావన అనే క్రీడాకారిణి బాలీవుడ్ క్రేజీ నటుడు హృతిక్ రోషన్ నటించిన వార్ చిత్రాన్ని చూసి విశ్లేషిస్తూ తన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. అందులో మగ అభిమానులు చిత్రంలోని ఫైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు చూసి ఆనందిస్తున్నారన్నారు. మహిళలు మాత్రం నటుడు హృతిక్‌రోషన్, మరో నటుడు టైగర్‌ను చూసి ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు. నటుడు హృతిక్ రోషన్ తన వీర్యాన్ని దానం చేయాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడీ విషయం వార్తగా మారింది. -
తాతగారు చివరగా చూసిన సినిమాల్లో ఇదొకటి!
‘‘2012లో ‘విక్కీ డోనర్’ చూశా, బాగా నచ్చింది. చివరి రోజుల్లో తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) టీవీలో చూసిన చివరి రెండు మూడు సినిమాల్లో ఇదొకటి. ‘తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు చేయకూడదు’ అన్నారాయన. ఏడాదిపాటు ‘విక్కీ డోనర్’ లాంటి స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా. నిర్మాత రామ్మోహన్ సలహాతో రీమేక్‌కి ఓటేశా. రియల్ లైఫ్‌లో నాకు పిల్లలు లేకపోవడం ఈ సినిమా చేయడానికి ఓ కారణం’’ అని సుమంత్ అన్నారు. ఆయన హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుధీర్ పూదోట, వై.సుప్రియ నిర్మించిన సినిమా ‘నరుడా.. డోనరుడా’. హిందీ ‘విక్కీ డోనర్’కి ఇది రీమేక్. మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ నెల 4న రిలీజవుతోంది. ‘‘ఓ మహిళగా చెబుతున్నా.. ఫ్యామిలీ అందరూ చూడదగ్గ చిత్రమిది. వైవిధ్యమైన, సున్నితమైన కథను మల్లిక్ రామ్ తెరకెక్కించిన తీరు బాగుంది’’ అని వై. సుప్రియ అన్నారు. ‘‘వీర్యదానం మీద చాలా సినిమాలొచ్చాయి. కానీ, ‘విక్కీ డోనర్’ వంటి గొప్ప సినిమా ఇప్పటివరకూ రాలేదు’’ అని మల్లిక్ రామ్ అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘కథ గీత దాటితే.. జుగుప్సగా, బూతుగా అనిపించే అవకాశం ఉంది. కానీ, హృదయానికి హత్తుకునేలా తీశారు’’ అన్నారు. ‘‘సుమంత్ ఎలాంటి పాత్రలోనైనా నటించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది’’ అని సుధీర్ పూదోట అన్నారు. -
అలా చేయండి... ఐఫోన్ దక్కించుకోండి!
బీజింగ్: యుద్ధ సమయాల్లో దేశరక్షణకు కలిసి రావాలని యువతకు దేశాలు పిలుపు ఇవ్వడం సర్వసాధారణ విషయం. దేశం కోసం వీరత్వం అవసరం లేదు వీర్యం ఇవ్వండి చాలు అంటూ చైనా పిలుపు ఇచ్చింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. వీర్యం దానం చేయాలని 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులకు విజ్ఞప్తి చేసింది. వీర్య కణాల కొరత కారణంగా చైనాలోని స్పెర్మ్ బ్యాంకులు నిండుకున్నాయి. రెండో సంతానం పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వీర్య కణాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో స్పెర్మ్ బ్యాంకులు ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి. దీంతో వీర్య దాతల కోసం విపరీతంగా వెదుకుతున్నారు. సోషల్ మీడియా ద్వారా యువకులకు వల వేస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని, రోజ్-గోల్డ్ ఐఫోన్ సొంతం చేసుకోవచ్చని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 'ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. వీర్య దానంతో ఐఫోన్ కలను నెరవేరచ్చకోండి' అంటూ షాంఘై స్పెర్మ్ బ్యాంకు ఆన్లైన్ లో ప్రకటన ఉంచింది. 'వీర్యం దానం చేయండి, మీ దేశభక్తిని నిరూపించుకోండి' అంటూ స్పెర్మ్ బ్యాంకులు ప్రచారం చేస్తున్నాయి. దేశాన్ని వృద్ధాప్యం నుంచి బయటపడేసేందుకు వీర్యం దానం చేయాలని ప్రభుత్వ వార్తా సంస్థ కోరింది. సంబంధంలేని వ్యక్తుల వీర్యంతో పిల్లల్ని కనడం కన్ఫ్యూసియనిజం విలువలకు విరుద్ధమని కొంత మంది వాదిస్తున్నారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని.. వీర్యం, రక్తం దానం చేయడం ఒకటేనని బీజింగ్ స్పెర్మ్ బ్యాంకు కౌంటర్ ఇచ్చింది.