rs.500 notes
-
రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ!
రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్‌లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw — ReserveBankOfIndia (@RBI) June 17, 2023 నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్‌లతో సహా, ప్రెస్‌లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది. ఇదీ చదవండి : స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
షాకింగ్: ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు
సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకవైపు నో క్యాష్ బోర్డులతో పలు ఏటీఎంలు వెక్కిరిస్తోంటే..మరోవైపు అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంలలో నకిలీ నోట్ల హంగామా వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో నకిలీ రూ.500నోట్లు ఆందోళనలో పడేశాయి. సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నకిలీ 500 రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', 'భారతీయ మనోరంజన్ బ్యాంకు', 'చురాన్ లేబుల్' పేరుతో ఉన్న ఈ నకిలీ కరెన్సీ నోట్లు స్థానికుల్లో కలవరం పుట్టించాయి. అశోక్ కుమార్ పాథక్ అనే రిటైర్డ్ ఉద్యోగికి ఆదివారం ఉదయం ఈ షాకింగ్ ఘటన ఎదురైంది. ఏటీఎం నుంచి 4500 రూపాయలను విత్ డ్రా చేయగా దాంట్లో ఒక నోటుపై 'చిల్డ్రన్ బ్యాంక్ అఫ్ ఇండియా' రాసి వుండటాన్ని ఆయన గుర్తించారు. ఈయనతో పాటు మరికొందరికికూడా ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకు వారికి ఫిర్యాదు చేశారు. అయితే తాము అన్ని ఏటీఎంలలో కరెన్సీ నోట్లను తనిఖీ చేశామని, ఎలాంటి నకిలీ నోట్లను తాము గుర్తించలేదని బ్యాంకు మేనేజర్ బచన్ షా చెప్పారు. సంబంధిత ఏజెన్సీపై చర్య తీసుకోవాలని కలకత్తాలోని తమ ప్రధాన కార్యాలయానికి ఒక నివేదికను పంపినట్టు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై సమాజ్‌వాద్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.. దేశంలోని చాలా ఏటీఎంలు నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేస్తున్నాయని ఎస్పీ జిల్లా కార్యదర్శి ప్రమోద్ యాదవ్ ఆరోపించారు. -
కొత్త నోట్లొచ్చాయ్
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : చిల్లర నోట్ల కొరత కారణంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు రూ.500 కొత్తనోట్లు జిల్లాకు చేరాయి. వాటిని అన్ని బ్యాంకులకు గురువారం నుంచి పంపిణీ చేసే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. శుక్రవారం నుంచి ఈ కొత్త నోట్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుంటే.. నగదు కోసం బ్యాంకులకు వెళ్లే ఖాతాదారుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏటీఎంలలోఎప్పటికప్పుడు నగదు పెడుతున్నప్పటికీ తక్కువగానే ఉండటంతో క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. ఎక్కువచోట్ల రూ.2,000 నోట్లు మాత్రమే వస్తుండటంతో వాటిని మార్చుకునేందుకు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామాల్లోని బ్యాంకులకు రోజుకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు మాత్రమే నగదు ఇస్తుండటంతో మధ్యాహ్నం 2 గంటలకే అయిపోతున్నాయి. ఆగని మోసాలు మరోవైపు బ్యాంకుల వద్ద మోసాలు ఆగటం ఉన్నాయి. నల్లజర్ల మండలం అనంతపల్లి ఆంధ్రాబ్యాంక్ నుంచి వెలగాని రమణ అనే వ్యక్తి బుధవారం రూ.10 వేలు డ్రా చేసి తీసుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి లాక్కుపోయాడు. ఇదిలావుంటే.. చిరు వ్యాపారుల ఇబ్బందులు మరింత తీవ్రతరమయ్యాయి. ముఖ్యంగా పండ్ల వ్యాపారులు చిల్లర నోట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. బుధవారం నుంచి వ్యాపారాన్ని నిలిపివేశారు. మరోవైపు పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఈ సీజ¯ŒSలో రూ.4కు పైగా ఉండాల్సిన గుడ్డు ధర ప్రస్తుతం రూ.3.45 పలుకుతోంది. నిల్వ ఉంచలేని స్థితిలో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. స్కాలర్ షిప్పులు అందక అవస్థలు బ్యాంకుల్లో నగదు నిల్వలు పెద్దగా ఉండకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్‌లు అందటం లేదు. కాలేజీ యాజమాన్యాలు వారం రోజులుగా విద్యార్థులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నాయి బ్యాంకుల్లో నగదు లేదని చెబుతుండటంతో వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. భవన నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోవడంతో కూలీలు, మేస్రీ్తలు ఆందోళన చెందుతున్నారు. ఎలక్రీ్టషియన్లు ఇబ్బంది పడుతున్నారు. నెలాఖరు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వ అధికారుల్లో గుబులు మొదలైంది. ఉద్యోగుల వేతనాలను డిసెంబర్ 1 నాటికి బ్యాంకుల్లో నేరుగా జమ చేసినా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 3.75 లక్షల మందికి రూ.50 కోట్లను పింఛన్ల రూపంలో అందించాల్సి ఉంది. పింఛన్ల పంపిణీ ఎలా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే ఇబ్బందులు కొంతమేరకు తగ్గుతాయని ఆశిస్తున్నారు.