కొత్తగా విడుదల చేసిన రూ. రెండువేలు, రూ. 500 నోట్లు ఎలా ఉంటాయి, వాటిలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, కొత్త నోట్లను ప్రజలు ఎలా గుర్తుపట్టాలనే దానిపై భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా వివరణ ఇచ్చింది. కొత్తగా మహాత్మాగాంధీ సిరీస్‌లో విడుదలకానున్న రూ. రెండువేల కరెన్సీ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం ఉంటుందని, అదేవిధంగా దీనిపై ముద్రణ సంవత్సరం 2016 కూడా ముద్రించి ఉంటుందని తెలిపింది. దేశం తొలిసారిగా జరిగిన గ్రహాంతర వ్యోమనౌక యాత్రకు గుర్తుగా మంగల్యాన్ బొమ్మ నోటుపై ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఈ నోటుపై ముందువైపు, వెనుకవైపు ఉండే కొన్ని విశిష్ట లక్షణాలను ఆర్బీఐ వెల్లడించింది.