new banknotes
-
2,000 నోటు ఇక కనుమరుగే..!
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువగా రూ.2,000కు బదులు రూ.500 నోట్లే ఉంచుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కు తీసుకోడానికి ఇది సంకేతమనీ ఆ వర్గాలు సూచిస్తున్నాయి. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాధానం ఇస్తూ, రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలుపు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ► ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు ఏవీ లేనప్పటికీ, బ్యాంకులు తమకు తాముగా తమ ఏటీఎంలను తక్కువ విలువగల నోట్లతో నింపుతున్నాయి. ► ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ, తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్ల వినియోగాన్ని నిలుపుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ► నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్‌గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారం వ్యయాలపరంగా బ్యాంకింగ్‌పై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ అంశం కూడా బ్యాంకులు రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టడానికి కొంత వెనక్కుతగ్గేలా చేస్తోంది. ► సమాచార హక్కు చట్టం ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే, రూ.2,000కు సంబంధించి 2016–17లో 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించడం జరిగింది. 2017–18లో ఈ సంఖ్య 111.507కు పడిపోయింది. 2018–19లో ఇది మరింతగా 46.690 మిలియన్ నోట్లకు తగ్గింది. దీని ప్రకారం చూస్తే రూ.2,000 నోటును ఆర్బీఐ క్రమంగా వెనక్కు తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ► అధిక విలువ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ► 2016 నవంబర్‌లో కేంద్రం రూ.1,000, రూ.500 విలువ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ► రూ.2,000 నోటును ఉపసంహరించే ప్రతిపాదనఏదీ ప్రభుత్వం వద్ద లేదని గత ఏడాది డిసెంబర్లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, చెలామణీలో ఉన్న నోట్ల (ఎన్ఐసీ) విలువ 2016 నవంబర్ 4న రూ.17,74,187 కోట్లు. 2019 డిసెంబర్ 2 నాటికి ఈ విలువ రూ.22,35,648 కోట్లకు పెరిగింది. ► వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య చెలామణీలో ఉన్న నోట్ల విలువ సగటున 14.51 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే, 2019 డిసెంబర్ 2 నాటికి ఎన్ఐసీ రూ.25,40,253 కోట్లకు చేరి ఉండవచ్చు. -
జెట్ స్పీడుతో నోట్ల ముద్రణ
మైసూరు: నోట్ల ముద్రణలో మైసూరులోని ఆర్బీఐ ముద్రణాకేంద్రం 3 ప్రపంచ రికార్డులు సృష్టించింది. తక్కువ సమయంలో ఎక్కువ నోట్ల ముద్రణ, ముడిసరుకుల వృథా తక్కువ, తక్కువ వ్యయంలో ముద్రణ ఇలా 3 కొత్త రికార్డులను నెలకొల్పింది. తక్కువ వేస్టేజ్, వ్యయంలో... అమెరికాలో ఒక కొత్త నోటు ముద్రణకు రూ.4, చైనాలో రూ.3.50 ఖర్చవుతోంది. మైసూరు ప్రెస్‌లో ఈ ఖర్చు రూ.3.14 మాత్రమే. నోట్ల ముద్రణలో ముడిసరుకు వృథాను 3.5 శాతానికి పరిమితం చేసి అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 4 శాతంతో చైనా రెండో స్థానంలో కొనసాగుతుండేది. తాజాగా మైసూర్ ప్రెస్ కేవలం రెండు శాతం వేస్టేజీతో తొలిస్థానం పొందింది. అమెరికాలో నెలకు 8.5 మిలియన్ల(85 లక్షల) కొత్త నోట్లు ముద్రితమవుతుండగా చైనాలో ఈ సంఖ్య 8 మిలియన్లు(80 లక్షలు). మైసూరు ముద్రణాలయం గతంలోనే 10.7(కోటి ఏడు లక్షలు) మిలియన్ల నోట్లు ముద్రించి అమెరికా, చైనాల కంటే ముందుంది. నోట్ల రద్దు అనంతరం ఈ సంఖ్య 12.11(1.21 కోట్లు) మిలియన్లకు చేరుకుంది. -
ఇదో ముక్కోణపు కథ..
► ఆర్బీఐ–బ్యాంకులు– కేంద్రం బ్యాంకులు 2017 మార్చికల్లా ఎన్ పీఏలకు పూర్తి కేటాయింపులు చేసి బ్యాలన్స్ షీట్లలో చూపించాలని రఘురామ్ రాజన్ షరతు పెట్టారు. నల్లధనాన్ని ఏరేయాలనుకున్న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ఆర్బీఐపై భారీ బాధ్యతే పెట్టింది. చివరి రెండు నెలలూ తమ వ్యాపారాన్నంతా పక్కన పెట్టి బ్యాంకులు జనం నుంచి పాత నోట్లు తీసుకోవటం, కొత్త నోట్లు ఇవ్వటానికే పరిమితమయ్యాయి. ఇదో ట్రయాంగిల్ స్టోరీలా మారింది. బ్యాంకుల ఎన్ పీఏలు సెప్టెంబర్ నాటికే రూ.7 లక్షల కోట్లను దాటేశాయి. వీటిలో అధికం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. వీటికి కేటాయింపులు చేయడం బ్యాంకులకు సవాలుగా మారింది. ఆస్తులు అమ్మి రుణాలు తీర్చటానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నా అవి ఫలించటం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారూ భారీగానే ఉన్నారు. ఇవన్నీ ఎన్ పీఏలను పెంచేశాయి. అయితే, నోట్ల రద్దుతో బ్యాంకుల్లో చేరిన భారీ డిపాజిట్లు మూలధన అవసరాలు తీరుస్తాయనేది తాజా అంచనా. ద్రవ్యోల్బణమే ఆర్బీఐ టార్గెట్? రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 4తో ముగిసింది. తర్వాత ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయ్యారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న విషయంలో కేంద్రం, ఆర్బీఐ అంగీకారానికి వచ్చాయి. ఇక ఆర్బీఐ అనుమతుల మేరకు దేశంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, ఈక్విటీస్ స్మాల్ బ్యాంకు పేరుతో కొత్త తరహా బ్యాంకింగ్ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయి. -
ఊరట
నోట్ల మార్పిడిపై ఆందోళన చెందవద్దు ► ఆర్బీఐ వెల్లడి ► త్వరలోఏటీఎంలలో కొత్త నోట్లు ► అత్యవసర సర్వీసుల్లోనూ24 వరకు గడువు పెంపు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవడంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఊరట కలిగించే సమాచారం. డిసెంబరు 30వ తేదీ తరువాత కూడా పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. చెన్నైలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయం సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : కేంద్ర ప్రభూత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు ఆఖరులోగా పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్చుకోవాలని కేంద్రం గడువు విధించింది. కొత్త నోట్లను మార్చుకునేందుకు రూ.4వేలు పరిమితి విధించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా బ్యాంకుల వైపు పరుగులు తీశారు. ఖాతాదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు శని, ఆదివారాల్లో కూడా పనిచేశారుు. కనీస ఖర్చులకు సైతం నగదు కరువై ఏటీఎంలను ఆశ్రరుుంచారు. తెరుచుకోని ఏటీఎంలను చూసి తెల్లమొహం వేస్తున్నారు. పాత నోట్ల మార్పిడికి ఇక నెలన్నర రోజులేనని ప్రజలు కంగారుపడుతున్నారు. గడువు పొడిగింపు ఇదిలా ఉండగా, డిసెంబరు 30వ తేదీ తరువాత కూడా పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను కొత్తవిగా మార్చుకోవచ్చని ఆర్బీఐ ఒక ప్రకటన చేసి ప్రజలకు ఊరట కలిగించింది. ప్రజలు నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు రూపే కార్డులు, ప్రీపెరుుడ్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్, క్రెడిట్ కార్డులను సైతం వినియోగించవచ్చని ఆర్బీఐ చెబుతోంది. డిసెంబరు 30వ తేదీతో కరెన్సీ మార్పిడి గడువు ముగిసిపోరుునా, కొన్ని ఆర్బీఐల ద్వారా ఆ తరువాత కూడా పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతేగాక రైలు టిక్కెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, ఫార్మసీ దుకాణాల్లో ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను చలామణీ చేసుకోవచ్చని గడువు పొడిగించారు. అంతేగాక త్వరలో ఏటీఎంల ద్వారా కొత్త నోట్లను పొందేలా బ్యాంకులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. చిల్లర కోసం తిప్పలు :పాత నోట్లను కొత్తవిగా మార్చుకోవడం ఒక ఎత్తరుుతే, కేవలం రూ.2000నోటు మాత్రమే ఇస్తున్న కారణంగా చిల్లర నోట్ల కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. చిన్నపాటి అవసరాలకు చేతిలో ఉన్న రూ.2000నోటు వినియోగించుకోలేక పోతున్నారు. బ్యాంకుల్లో అడిగితే ఏటీఎంలను చూపుతున్నారు. ఏటీఎంల వద్దకు వెళితే షట్టర్లు మూసి ఉంటున్నారుు. మూసి ఉన్న ఏటీఎంలను చూసి ఆవేశానికి లోనైన ఒక ఖాతాదారుడు పొన్నేరిలోని ఒక ప్రరుువేటు బ్యాంకు ఏటీఎం అద్దాలు పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశాడు. కొన్ని బ్యాంకుల వారు వృద్ధులు, గర్భిణులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చెన్నై ఆర్బీఐ కార్యాలయంలో కార్లు నిలిపే స్థలంలో ప్రజలకు కూర్చునే వసతి కల్పించి అధికారులు, సిబ్బంది కార్లలో రావద్దని ఆదేశాలు జారీచేశారు. కొత్త రూపారుు నోటును విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ విళపురానికి చెందిన రామమూర్తి అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో సోవారం పిటిషన్ దాఖలు చేశాడు. -
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
-
కొత్తనోట్లను ఎలా గుర్తించాలంటే!
-
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
అవినీతి, పన్ను ఎగవేతపై ఉక్కుపాదం మోపడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఖజానాకు అక్షరాల రూ. మూడు లక్షల కోట్ల (45 బిలియన్ డాలర్ల) లాభం చేకూరనుందని విదేశీ మీడియా విశ్లేషించింది. దేశ బడ్జెట్‌కు చేరనున్న ఈ అదనపు మొత్తం ఏకంగా ఐస్లాండ్ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానమని పేర్కొంది. రూ. 500, వెయ్యినోట్ల రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఏకంగా రూ. మూడు లక్షల కోట్ల (45బిలియన్ డాలర్ల) నల్లధనం వెలికిరానుందని, పన్నును తప్పించుకునేందుకు ఈ మొత్తాన్ని కరెన్సీని విదేశాల్లో దాచిపెట్టారని ముంబైకి చెందిన బ్రోకరేజి సంస్థ ఎడెల్వీస్ సెక్యూరిటీ లిమిటెడ్ విశ్లేషించింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ లిమిటెడ్ మరింత ఆశాజనకమైన అంచనా వేసింది. ఏకంగా 4.6 లక్షల కోట్ల నల్లధనం బయటకు రావొచ్చునని అంచనా వేసింది. ఆర్థికవేత్తలు పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావాలు ఏమిటన్న దానిపై లోతుగా విశ్లేషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 17.8 లక్షల కోట్ల నగదు కరెన్సీరూపంలో చలామణిలో ఉంది. పెద్దనోట్ల రద్దుతో ఏకంగా ఇందులో 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోనుంది. ఇలా తుడిచిపెట్టుకుపోతున్న కరెన్సీలో మూడోవంతు నల్లధనం లేదా, ప్రకటించని నగదు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నల్లధనం వెలుగులోకి వస్తే.. ఆసియాలో అత్యంత ఎక్కువ ద్రవ్యలోటు కలిగిన భారత్.. ఆ లోటును భర్తీచేసుకొని మెరుగైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని భావిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ నల్లధనాన్ని దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని, అంతేకాకుండా ఆర్బీఐ తన అప్పులను తీర్చుకొని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు కూడా సమకూర్చవచ్చునని ఎడెల్వీస్ విశ్లేషకుడు మనోజ్ బహెతీ తెలిపారు. -
కొత్తనోట్లను ఎలా గుర్తించాలంటే!
కొత్తగా విడుదల చేసిన రూ. రెండువేలు, రూ. 500 నోట్లు ఎలా ఉంటాయి, వాటిలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, కొత్త నోట్లను ప్రజలు ఎలా గుర్తుపట్టాలనే దానిపై భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజాగా వివరణ ఇచ్చింది. కొత్తగా మహాత్మాగాంధీ సిరీస్‌లో విడుదలకానున్న రూ. రెండువేల కరెన్సీ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం ఉంటుందని, అదేవిధంగా దీనిపై ముద్రణ సంవత్సరం 2016 కూడా ముద్రించి ఉంటుందని తెలిపింది. దేశం తొలిసారిగా జరిగిన గ్రహాంతర వ్యోమనౌక యాత్రకు గుర్తుగా మంగల్యాన్ బొమ్మ నోటుపై ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఈ నోటుపై ముందువైపు, వెనుకవైపు ఉండే కొన్ని విశిష్ట లక్షణాలను ఆర్బీఐ వెల్లడించింది. అవి ఏమిటంటే.. రెండువేల నోటు ముందువైపు.. 2000 అని అంకెల్లో రాసిన దానికింద రిజిస్టర్ నంబర్ ఉంటుంది. 2000 ఇమేజ్ కాస్త గుప్తంగా తరచిచూస్తే కనిపించేవిధంగా ఉంటుంది. దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది. నోటు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. బ్యాంకు నోటు ఎడుమవైపు ‘ఆర్బీఐ’ అని, ‘2000’ అని సూక్ష్మంగా రాసి ఉంటుంది. ‘భారత్’ అని విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్‌లో రాసి ఉంటుంది. అంతేకాకుండా ఆర్బీఐ, 2000 అని కలర్షిఫ్ట్లో రాసి ఉంటాయి. నోటును కాస్తా కదిలిస్తే ఇవి ఆకుపచ్చని రంగు నుంచి నీలిరంగులో మారుతాయి. నోటు కుడివైపున గ్యాంరెటీ క్లాజ్, గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి. కుడివైపున కిందిభాగంలో రూపీ ముద్ర, ₹2000 అని కలర్ చేజింగ్ (ఆకుపచ్చ రంగు నుంచి నీలిరంగులోకి మారుతాయి)లో రాసి ఉంటాయి. మహాత్మాగాంధీ బొమ్మకు కుడివైపున అశోక స్తంభం చిహ్నంతోపాటు, ఎలక్ట్రోటైప్ (2000 అని) వాటర్ మార్క్స్ ఉంటాయి. ఎడుమవైపున పైభాగంలో, కుడివైపున కిందిభాగంలో సిరీస్ అంకెలు చిన్నవి నుంచి పెద్దవిగా ఉంటాయి. అంధుల కోసం కళ్లు కనిపించని వారు గుర్తించేందుకు మహాత్యాగాంధీ బొమ్మ, అశోక స్తంభం చిహ్నం ఉబ్బెత్తుగా ఉండి, బ్లీడ్ లైన్స్, ఐడెంటిటీ మార్క్స్ ఉంటాయి. సమాంతరంగా, దీర్ఘచతురస్రాకారంలో ₹2000 ఉబ్బెత్తుగా నోటుపై రాసి ఉంటుంది. నోటు కుడివైపున, ఎడుమవైపున కోణాకారంలో బ్లీడ్లైన్స్ ఉబ్బెత్తుగా ఉంటాయి. రూ. రెండువేల నోటు వెనుకవైపున ఎడుమవైపు ముద్రణ సంవత్సరం ముద్రించి ఉంటుంది నినాదంతో కూడిన స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది. కుడివైపునకు చేరువగా భాషల ప్యానెల్ ఉంటుంది. మంగల్యాన్ బొమ్మ ఉంటుంది. దేవనాగరి అంకెలలో २००० అని రాసి ఉంటుంది. రూ. రెండువేల నోటు 66 మిల్లిమీటర్ల వెడల్పు, 166 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఇక రూ. 500 నోటుపై ఏమి ఉంటాయంటే.. మహాత్మాగాంధీ సిరీస్‌లో విడుదల చేసిన కొత్త రూ. 500 నోట్లపై ‘E’ అనే ఇంగ్లిష్ అక్షరంతోపాటు ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, ముద్రణ సంవత్సరం ‘2016’, స్వచ్ఛ భారత్ లోగో, నోటు వెనుకవైపున ముద్రించి ఉంటాయి. గతంలో జారీచేసిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (ఎస్బీఎన్) సిరీస్‌కు రంగులో, పరిణామంలో, డిజైన్‌లో, థీమ్‌లో, భద్రతపరమైన ఫీచర్స్ విషయంలో కొత్త 500 నోటు భిన్నంగా ఉంటుంది. ఈ నోటు వెడల్పు 66మిల్లీమీటర్లు, పొడవు 150 మిల్లీమీటర్లు రంగు స్టోన్ గ్రే (నెరిసిన ముదురు రంగు) భారత వారసత్వ సందప అయిన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట బొమ్మ నోటు వెనుకవైపు ముద్రించి ఉంటాయి. అందులో కోసం మహాత్మాగాంధీ బొమ్మ, అశోక చిహ్నం, బ్లీడ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉబ్బెత్తుగా ముద్రించి ఉంటాయి.