కేంద్ర ప్రభూత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
నోట్ల మార్పిడిపై ఆందోళన చెందవద్దు
► ఆర్‌బీఐ వెల్లడి
► త్వరలోఏటీఎంలలో కొత్త నోట్లు
► అత్యవసర సర్వీసుల్లోనూ24 వరకు గడువు పెంపు
పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవడంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఊరట కలిగించే సమాచారం. డిసెంబరు 30వ తేదీ తరువాత కూడా పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. చెన్నైలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయం సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : కేంద్ర ప్రభూత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు ఆఖరులోగా పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను మార్చుకోవాలని కేంద్రం గడువు విధించింది. కొత్త నోట్లను మార్చుకునేందుకు రూ.4వేలు పరిమితి విధించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా బ్యాంకుల వైపు పరుగులు తీశారు. ఖాతాదారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు శని, ఆదివారాల్లో కూడా పనిచేశారుు. కనీస ఖర్చులకు సైతం నగదు కరువై ఏటీఎంలను ఆశ్రరుుంచారు. తెరుచుకోని ఏటీఎంలను చూసి తెల్లమొహం వేస్తున్నారు. పాత నోట్ల మార్పిడికి ఇక నెలన్నర రోజులేనని ప్రజలు కంగారుపడుతున్నారు.
గడువు పొడిగింపు
ఇదిలా ఉండగా, డిసెంబరు 30వ తేదీ తరువాత కూడా పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను కొత్తవిగా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ ఒక ప్రకటన చేసి ప్రజలకు ఊరట కలిగించింది. ప్రజలు నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు రూపే కార్డులు, ప్రీపెరుుడ్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్, క్రెడిట్ కార్డులను సైతం వినియోగించవచ్చని ఆర్‌బీఐ చెబుతోంది. డిసెంబరు 30వ తేదీతో కరెన్సీ మార్పిడి గడువు ముగిసిపోరుునా, కొన్ని ఆర్‌బీఐల ద్వారా ఆ తరువాత కూడా పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతేగాక రైలు టిక్కెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పెట్రోలు బంకులు, ఆసుపత్రులు, ఫార్మసీ దుకాణాల్లో ఈ నెల 24వ తేదీ వరకు పాత నోట్లను చలామణీ చేసుకోవచ్చని గడువు పొడిగించారు. అంతేగాక త్వరలో ఏటీఎంల ద్వారా కొత్త నోట్లను పొందేలా బ్యాంకులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
చిల్లర కోసం తిప్పలు :పాత నోట్లను కొత్తవిగా మార్చుకోవడం ఒక ఎత్తరుుతే, కేవలం రూ.2000నోటు మాత్రమే ఇస్తున్న కారణంగా చిల్లర నోట్ల కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. చిన్నపాటి అవసరాలకు చేతిలో ఉన్న రూ.2000నోటు వినియోగించుకోలేక పోతున్నారు. బ్యాంకుల్లో అడిగితే ఏటీఎంలను చూపుతున్నారు. ఏటీఎంల వద్దకు వెళితే షట్టర్లు మూసి ఉంటున్నారుు. మూసి ఉన్న ఏటీఎంలను చూసి ఆవేశానికి లోనైన ఒక ఖాతాదారుడు పొన్నేరిలోని ఒక ప్రరుువేటు బ్యాంకు ఏటీఎం అద్దాలు పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశాడు. కొన్ని బ్యాంకుల వారు వృద్ధులు, గర్భిణులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చెన్నై ఆర్‌బీఐ కార్యాలయంలో కార్లు నిలిపే స్థలంలో ప్రజలకు కూర్చునే వసతి కల్పించి అధికారులు, సిబ్బంది కార్లలో రావద్దని ఆదేశాలు జారీచేశారు. కొత్త రూపారుు నోటును విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ విళపురానికి చెందిన రామమూర్తి అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో సోవారం పిటిషన్ దాఖలు చేశాడు.