
జెట్ స్పీడుతో నోట్ల ముద్రణ
నోట్ల ముద్రణలో మైసూరులోని ఆర్‌బీఐ ముద్రణాకేంద్రం 3 ప్రపంచ రికార్డులు సృష్టించింది.
మైసూరు: నోట్ల ముద్రణలో మైసూరులోని ఆర్‌బీఐ ముద్రణాకేంద్రం 3 ప్రపంచ రికార్డులు సృష్టించింది. తక్కువ సమయంలో ఎక్కువ నోట్ల ముద్రణ, ముడిసరుకుల వృథా తక్కువ, తక్కువ వ్యయంలో ముద్రణ ఇలా 3 కొత్త రికార్డులను నెలకొల్పింది.
తక్కువ వేస్టేజ్, వ్యయంలో...
అమెరికాలో ఒక కొత్త నోటు ముద్రణకు రూ.4, చైనాలో రూ.3.50 ఖర్చవుతోంది. మైసూరు ప్రెస్‌లో ఈ ఖర్చు రూ.3.14 మాత్రమే. నోట్ల ముద్రణలో ముడిసరుకు వృథాను 3.5 శాతానికి పరిమితం చేసి అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 4 శాతంతో చైనా రెండో స్థానంలో కొనసాగుతుండేది. తాజాగా మైసూర్ ప్రెస్ కేవలం రెండు శాతం వేస్టేజీతో తొలిస్థానం పొందింది. అమెరికాలో నెలకు 8.5 మిలియన్ల(85 లక్షల) కొత్త నోట్లు ముద్రితమవుతుండగా చైనాలో ఈ సంఖ్య 8 మిలియన్లు(80 లక్షలు). మైసూరు ముద్రణాలయం గతంలోనే 10.7(కోటి ఏడు లక్షలు) మిలియన్ల నోట్లు ముద్రించి అమెరికా, చైనాల కంటే ముందుంది. నోట్ల రద్దు అనంతరం ఈ సంఖ్య 12.11(1.21 కోట్లు) మిలియన్లకు చేరుకుంది.