రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు | RBI JE Recruitment 2021: 48 Posts, Check Important Dates | Sakshi
Sakshi News home page

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

Published Fri, Feb 5 2021 7:32 PM | Last Updated on Fri, Feb 5 2021 7:47 PM

RBI JE Recruitment 2021: 48 Posts, Check Important Dates - Sakshi

ముంబై ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ).. జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 48
» పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)–24, జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)–24.

» జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌): అర్హత: 65 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
» వయసు: 01.02.2021 నాటికి 20–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991– 01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

» జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): అర్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/55శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
» వయసు: 01.02.2021 నాటికి 20–30ఏళ్ల మధ్య ఉండాలి. 02.02.1991 –01.02.2021 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

» ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
» పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ఈ పరీక్ష ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు.
» లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌(ఎల్‌పీటీ): ఆన్‌లైన్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఎల్‌పీటీకి ఎంపిక చేస్తారు. జోన్‌ ఆధారంగా అఫీషియల్‌/లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021
» పరీక్ష తేది: 08.03.2021
» వెబ్‌సైట్‌: www.rbi.org.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement