ప్రధాన వార్తలు

ఏజెంట్లే లేకుండా ఎన్నికలా?: వైఎస్ జగన్
మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చల విడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా చంద్రబాబూ? – వైఎస్ జగన్ అసలు ఏజెంట్లే లేకుండా పోలింగ్ నిర్వహిస్తే.. వాటిని ఎన్నికలు అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశ్నించకపోతే, గొంతు విప్పకపోతే అసలు ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఎన్నికలు హాస్యాస్పదమే అవుతాయి. అప్పుడు ఎన్నికల అవసరం కూడా ఉండదు. ఇష్టం వచ్చినట్లు అంతా ఓట్లు వేసుకోవడమే. సీఎం చంద్రబాబు, ఆయనతో చేతులు కలిపి అంట కాగుతున్న ఎల్లో మీడియా లక్ష్యం ఇదే. వారి లక్ష్యం ప్రజలకు మంచి చేయడం, పాలకుల మోసాన్ని ప్రశ్నించడం కానే కాదు. కేవలం దోచుకో.. పంచుకో.. తినుకో.. అదే వారి ఎజెండా. దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుపడాలి.చంద్రబాబుకు మా డిమాండ్.. అలాగే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారికి మా విన్నపం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే, అది చేజారిపోతే.. నక్సలిజం అక్కడే పుడుతుంది. చంద్రబాబు ఈ రోజు ఒక ప్రమాదకర పరిస్థితికి పునాది వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. నిన్న జరిగిన రెండు ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి.పులివెందుల జెడ్పీటీసీ కింద ఆరు పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఏకంగా 700 మంది పోలీసులను పెట్టారు. కేవలం ఓటర్లను భయపెట్టడం కోసమే అంత మందిని మోహరించారు. ఉదయం 4 గంటలకల్లా జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వారు ఆయా గ్రామాల్లో మకాం వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూత్ వద్ద దాదాపు 400 మంది పాగా వేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. వారే ప్రోత్సహించారు. పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు, బయట నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు.. అంతా కలిపి మొత్తం 7 వేల మంది ఉంటారు. అంటే ఒక్కో ఓటరుకు బయట నుంచి దాదాపు ఒక్కో రౌడీని ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీరు ప్రజలను మోసం చేశారు. మీ పాలన మొత్తం రాక్షస పాలన అని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అందుకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ఇదివరకు చంబల్ లోయ బందిపోటు దొంగలను మరిపించేలా.. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, అడ్డగోలుగా దొంగ ఓట్లు వేసుకున్నార’ని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇలా అడ్డగోలుగా రాజకీయాలు చేసే వారిని నాయకుడనరని.. చంద్రబాబు ఒక మాబ్స్టర్.. ఫ్రాడ్‌స్టర్ అని తేల్చి చెప్పారు. ‘మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే.. మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే.. వెంటనే మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి’ అని సవాల్ విసిరారు. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే.. మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే.. ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దెప్పిపొడిచారు. ‘ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా?’ అని సీఎం చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. వెబ్ కాస్టింగ్, సీపీ ఫుటేజీ ఇస్తే ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది మరింతగా బట్టబయలవుతుందన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల వైఎస్సార్సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను తనతో కూర్చోబెట్టుకుని వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్‌లో పోలీసులు, టీడీపీ నాయకులు జట్టుగా ఏర్పడి వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, ఏజెంట్లపై దౌర్జన్యం చేయడం.. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను అడ్డుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించుకోవడం, కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేయడం నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసుల ఏకపక్ష దాడులు.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల దౌర్జన్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూపుతూ సాక్ష్యాధారాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరును తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. అందుకు నిన్న (మంగళవారం) జరిగిన ఎన్నికలు (పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు) ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్ బూత్‌లలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 15 పోలింగ్ బూత్‌లు ఉండగా, వాటిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అస్సలు ఉండనివ్వలేదు. ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్ దగ్గరకు పోనివ్వకుండా ఆపేసి రిగ్గింగ్ చేశారు. పోలీసుల ప్రోద్బలంతో బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వలేదు. ఇంత దారుణం ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడా ఉండదేమో.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప!.పోలింగ్ ఏజెంట్ల కీలక బాధ్యతలు ⇒ అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్ హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకీ తెలియజేయడం. ఈ బాధ్యతలన్నీ ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులు కల్పించబడ్డాయి. ⇒ ఒక పోలింగ్ ఏజెంట్ బూత్‌లోకి వెళ్లగానే పోలింగ్ మొదలవడానికి ముందే ఫామ్–12 (వారి అపాయింట్మెంట్ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ నిన్న (మంగళవారం) మా పార్టీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ వారు, పోలీసులు లాక్కుని చింపేశారు. ఆ స్థాయిలో ప్రజాస్వామ్యం దిగజారి పోవడం చరిత్రలో చూసి ఉండం.⇒ ఓటరు బూత్‌లోకి రాగానే తన పేరు చెబుతాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ సంతకం తీసుకుని బ్యాలెట్ ఇస్తాడు. రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ అయితే, దాన్ని నిర్ధారించేది పోలింగ్ ఏజెంట్. పోలింగ్ ముగిసిన తర్వాత ఫాం–32ను నింపి ఆ బూత్‌లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయనేది రికార్డు చేస్తారు. బూత్‌లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రిసైడింగ్ ఆఫీసరు.. ఏజెంట్ నుంచి ఒక రిసీట్ కూడా తీసుకుంటాడు. ఆ రికార్డుతో ఈ రిసీట్‌ను కూడా జత చేయాలి. మరోవైపు ఆ రికార్డును ధృవీకరించడమే కాకుండా, బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. చివరకు ఆ సీల్‌పై కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం చేస్తాడు. ఈ ఉప ఎన్నికల్లో ఇవన్నీ జరిగాయా? ఈ రోజు ఎంత దారుణంగా వారు ఎన్నికలు నిర్వహించారంటే, ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారంటే.. ఒక్కమాటలో చెప్పాలంటే అచ్చం చంబల్‌లోయ బందిపోట్ల మాదిరిగా వ్యవహరించారు. పోలీసులే దగ్గరుండి అన్నింటినీ ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా సవాల్ ⇒ మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రజలకు మంచి చేశారని నమ్మితే, వారు మీకు ఓటు వేస్తారనుకుంటే, వెంటనే నిన్నటి ఎన్నికలు రద్దు చేయండి. కేంద్ర బలగాలు దింపి, వారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టే, మీరు ప్రజలను మోసం చేశారు కాబట్టే, ప్రజలు మీకు ఓటు వేయరు కాబట్టే, విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రతి బూత్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్ వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ బయట పెడతారా? ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం లేదు. అయినా ఎవరెవరు బయటి నుంచి వచ్చి, పోలింగ్ బూత్‌లు ఆక్రమించి దొంగ ఓట్లు వేశారనేది చూపుతాం. ఇలా అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుణ్ని లీడర్ అనరు. మాబ్స్టర్ లేదా ఫ్రాడ్‌స్టర్ అంటారు. ⇒ ఎంత దారుణంగా నిన్నటి ఎన్నికలు జరిగాయంటే.. ఎక్కడైనా ఏ ఊరి ఓటర్లు ఆ ఊరిలోనే ఓట్లు వేస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా అదే జరుగుతుంది. ఓటర్లు వారి సొంత ఊళ్లలోనే ఓటేయడం సహజం. కానీ, ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఒక ఊరి నుంచి మరో ఊరికి పోలింగ్ బూత్‌లు మార్చేశారు.⇒ ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, నల్లగొండవారిపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి, మళ్లీ నల్లపురెడ్డిపల్లి వారు ఎర్రబల్లికి.. నల్లపురెడ్డిపల్లి నుంచి నల్లగొండవారిపల్లికి వెళ్లి ఓటు వేయాలంట. 4 కిలోమీటర్లు నడిచి వెళ్లేలా పోలింగ్ సెంటర్లు మార్చారు.⇒ దాదాపు 10,600 ఓట్లకు గాను, 4 వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. స్కెచ్ అక్కడే మొదలైంది. ఇంకా వారి ఆలోచన ఏమిటంటే, ఓటర్లు 4 కిలోమీటర్లు నడిచి పోతుంటే బెదిరించాలి. దాడి చేసి అడ్డగించాలి. ఓటేయకుండా చూడాలి. నిన్న అదే జరిగింది.ఏకంగా గ్రామాలే పంచుకున్నారుఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎవరైనా అంటారా? టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అరాచకం సృష్టించేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఎర్రబల్లెలో తిష్ట వేస్తే.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి భారీగా తన అనుచరులతో నల్లపురెడ్డిపల్లెలో మకాం వేశాడు. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఇ.కొత్తపల్లిలో వందల మంది కార్యకర్తలతో మకాం వేస్తే.. బీటెక్ రవి అనే టీడీపీ నాయకుడు పులివెందుల రూరల్ ఓటరు కాకపోయినా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేశాడు. పోలింగ్ బూత్‌లకు వైఎస్సార్సీపీ ఏజెంట్లు వెళితే, వారిపై దాడి చేసి, ఫామ్‌లు లాక్కుని చింపేశారు. ఓటర్ల స్లిప్‌లు కూడా లాక్కుని వారిని వెనక్కి పంపి, వారే ఓటు వేసుకున్నారు. ఎవరైనా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైనా, లేక తటస్థుడైనా బూత్ వైపు వస్తే టీడీపీ వారు బెదిరించి ఓటరు స్లిప్ లాక్కుని దౌర్జన్యంగా బయటకు పంపించారు.పులివెందుల మండలంలో టీడీపీ నేతల ఆగడాలను విలేకరుల సమావేశంలో వివరిస్తున్న వైఎస్ జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి⇒ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో ఇన్ని అక్రమాలతో జరిగింది ఎన్నికలేనా? అసలు ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?⇒ ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ నిజం కాదా?⇒ పులివెందుల టౌన్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి అక్రమ అరెస్ట్ నిజం కాదా? నిజానికి అక్కడ ఎన్నిక లేదు. అయినా తెల్లవారుజామున అరెస్టు చేశారు.⇒ మొట్నూతలపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు ఆపి, ఓటర్లను అడ్డగించడం నిజం కాదా?⇒ ఎర్రపల్లెలో మహిళలను ఓటు వేయనివ్వక పోవడం నిజం కాదా? ⇒ కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి, మంచంపై రైఫిల్ పెట్టి బెదిరించడం వాస్తవం కాదా?⇒ ఎర్రపల్లెలో రిగ్గింగ్‌కు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు స్వాగతం పలకలేదా?⇒ కనంపల్లెలో రిగ్గింగ్ జరిగిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడం, బిటెక్ రవి తమ్ముడు భరత్ బెదిరింపులు నిజం కాదా?⇒ తమను ఓటు వేయనీయాలంటూ ఓటర్లు కనంపల్లెలో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలేదా?⇒ పులివెందులలో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని బయటకు రానివ్వకపోవడం నిజం కాదా?⇒ ఒంటిమిట్టలోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఓటర్లు వాపోలేదా?⇒ ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ వాళ్లు స్లిప్‌లు ఇస్తూ, దొంగ ఓట్లు వేయించలేదా?⇒ ఎన్నిక పులివెందుల రూరల్‌లో జరుగుతుంటే, పులివెందులలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌కు డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి ఎందుకు హడావుడి చేశారు? ⇒ ‘కాల్చి పారేస్తా నా కొడకా’ అంటూ డీఎస్పీ మురళి బెదిరించడం వాస్తవం కాదా?⇒ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయలేదా? మా పార్టీ ఏజెంట్‌పై దారుణంగా దాడి జరగలేదా?⇒ చంద్రబాబూ.. నీవు నిజంగా మంచి చేశావనుకుంటే ఎందుకీ అక్రమాలు?భవిష్యత్తులో అవి మీకే చుట్టుకుంటాయి మీరు దౌర్భాగ్య పని చేస్తున్నారు. తప్పుడు వి«ధానానికి బీజాలు వేస్తున్నారు. అవే రేపు వృక్షాలు అవుతాయి. గ్రామాల్లో ఇప్పుడు మీరు తీసుకొచ్చే కక్షలు, దాడులు రాబోయే రోజుల్లో మీకే చుట్టుకుంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావొచ్చు. ఈ వయసులో ఈ పనులేంటి? కనీసం రామ, కృష్ణ అనుకుంటే పుణ్యం వస్తుంది. ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు. ఇప్పటికన్నా రవ్వంత మార్పు తెచ్చుకోమని చంద్రబాబుకు గట్టిగా హితవు పలుకుతున్నా.డమ్మీ కన్నా దారుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా, దురదృష్టవశాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) డమ్మీ కన్నా దారుణమైన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. అందుకే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. కోర్టులో కేసులు వేస్తాం. ఈ ఆధారాలన్నీ చూపుతాం. నిన్న పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. పోలీసులు పూర్తి వివక్ష⇒ ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఐదు మంది కలిసి వెళ్లినా కూడా పోలీసులు తరిమి తరిమి కొట్టారు. మహిళా ఏజెంట్లపైనా దాడులు చేశారు. ఇతర నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్లు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా షామియానాలు వేసుకుని, భోజనాలు చేస్తున్నా పోలీసులు వేడుక చూశారు. ⇒ ఈ ఎన్నికల కోసం పోలీసులను ఏరికోరి నియమించుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు సమీప బంధువు. వరసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపారు. ఆయన అచ్చంగా పచ్చ చొక్కా వేసుకుని సోమవారం రాత్రి నుంచే తనకు కావాల్సిన వారిని విధుల్లోకి తీసుకుని పులివెందులలో మకాం వేసి, ఎన్నికలు జరిపారు. యథేచ్ఛగా దోపిడీ, వాటాలు చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతిలో వీళ్లందరూ భాగస్వాములు. డీఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్లు.. మాఫియా రింగ్ లీడర్ ఎవరంటే డీఐజీ. బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి.. ఇసుక, మట్టి, ల్యాటరేట్, క్వార్ట్›జ్, సిలికా.. పేకాట క్లబ్బులు.. ఇంకా ఏ మైన్ ఉన్నా కలెక్షన్ అంతా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. వచ్చిన దాంట్లో ఎమ్మెల్యేలకు ఇంత.. చినబాబుకు ఇంత.. పెదబాబుకు ఇంత అని ఈ డీఐజీలు, డీఎస్పీలు, సీఐలు నడిపిస్తున్నారు. ఇదీ ముఠా నాయకత్వం.చంద్రబాబు మాట వినకపోతే.. ఒకవేళ పోలీసు అధికారులు ఎవరైనా చంద్రబాబు మాట వినకపోతే.. డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు కావాల్సిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకెళ్లారు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్, విశాల్ గున్నీలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిరాణా టాటాపై కూడా అక్రమ కేసు. ఇంకా ఎంతో మందిని సస్పెండ్ చేశారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్‌క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు.ఆనాడు ఏం జరిగిందో గుర్తుందా?2017లో నా ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలు కావడానికి ముందు నంద్యాల ఉప ఎన్నికలోనూ ఇలాగే చేశారు. 27 వేలతో గెల్చి ఇక మా పార్టీ పనైపోయిందని అదేపనిగా చెప్పారు. కానీ ఏం జరిగింది? సరిగ్గా ఏడాదిన్నర తర్వాత అదే నంద్యాలలో 35 వేలతో గెల్చాం. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రమంతా చంద్రబాబును భూస్థాపితం చేశాం. ఇంకో మూడున్నర ఏళ్ల తర్వాత ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు.ఇవిగో ఆధారాలు..⇒ ఇతర నియోజకవర్గాలు, మండలాల నుంచి వచ్చిన వారు ఎలా దొంగ ఓట్లు వేసింది.. వారు ఎవరనే పూర్తి వివరాలతో ఈ ఫొటోల్లో (ఫొటోలు చూపుతూ) చూడండి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే వారు దొంగ ఓట్లు వేశారు. ఆ వేసింది జమ్మలమడుగుకు చెందిన (ఫొటో చూపుతూ) టీడీపీ కార్యకర్తలు దస్తగిరి, సందీప్‌కుమార్. నల్లపురెడ్డిపల్లె పోలింగ్‌బూత్‌లో వారు దొంగ ఓట్లు వేశారు. మరో ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు (బుధవారం) రీ పోలింగ్‌లో కూడా దొంగ ఓట్లు వేస్తున్నారు (ఆ ఫోటోలు కూడా ప్రెస్మీట్లో చూపారు). పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేరు కాబట్టి, యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.⇒ జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ప్రకాశం, మైలవరానికి చెందిన ద్వారచర్ల జనార్ధనరెడ్డి నల్లపురెడ్డిపల్లెలో ఓటు వేశారు.⇒ పొన్నతోట మల్లికార్జున టీడీపీ జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి (చంద్రబాబుతో దిగిన ఫొటో ప్రదర్శించారు). జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కూడా. వీళ్లందరూ వచ్చి పులివెందులలో ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ అనే వాడిని ఉండనివ్వలేదు. ఇక అడిగేవాడు లేడని దొంగ ఓట్లు వేసుకున్నారు. కలెక్టర్ రెండు చేతులు జేబులో పెట్టుకుని దొంగ ఓట్లు వేయిస్తున్నాడు.⇒ కర్మలవారిపల్లె గ్రామం టీడీపీ సర్పంచ్ మారెడ్డి చిన్నపుల్లా రెడ్డి పులివెందులలో ఓటు వేశారు. జమ్మలమడుగు మండలానికి చెందిన నాగేశ్వరరెడ్డి, అదే మండలంలోని గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డిలు నల్లపురెడ్డిపల్లెలో దొంగ ఓటు వేశారు.⇒ నవాబుపేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్, హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్, కమలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుళ్లాయప్ప ఇలా అందరూ దొంగ ఓటర్లే. ⇒ విచిత్రంగా బుధవారం రీ పోలింగ్ జరుగుతుంటే కూడా.. కమలాపురం నియోజకవర్గానికి చెందిన నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుజ్జల నారాయణ యాదవ్ పులివెందులలోని ఈ కొత్తపల్లిలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డాడు. ఇలా రిపిటేషన్ పద్ధతిలో దొంగ ఓటర్లను తిప్పుకున్నారు.

వారి సభ్యత్వాలు రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన ఫ్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 14న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం తాజాగా సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలు ఏవైనా రద్దయినట్టేనని పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వులోని.. ‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం..’ అనే వాక్యాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో 2024 ఆగస్టు 16న ప్రొఫెసర్ కోదండరాం, అమేర్ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా చేసిన ప్రమాణ స్వీకారాలు రద్దయినట్టయ్యింది. గవర్నర్ కోటాకు సంబంధించి భవిష్యత్తులో జరిగే నామినేషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. కోదండరాం, అమేర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వారు ఎమ్మెల్సీలుగా మండలిలో తిరిగి ప్రవేశించాలంటే మళ్లీ సిఫారసు చేయబడాలని జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండకూడదనే వాదనను తిరస్కరిస్తూ, ‘అప్పట్లో పిటిషనర్ల పేర్లు తిరస్కరించినప్పుడు కూడా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి..’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సిఫారసులు.. తిరస్కరణ.. సిఫారసులు 2023 జూలైలో అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సిఫారసు చేసింది. అయితే సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వారికి రాజకీయ నేపథ్యం ఉండటాన్ని ప్రస్తావించడంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)కు అనుగుణంగా వారి నియామకాలు లేవని పేర్కొంటూ వారి నామినేషన్లను తిరస్కరించారు. కాగా 2023 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమేర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ నామినేషన్లతో పాటు, గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని దాసోజు, కుర్ర హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో హైకోర్టు.. గవర్నర్ తిరస్కరణను రద్దు చేయడంతో పాటు కొత్త నామినేషన్లను కూడా కొట్టివేసింది. గవర్నర్ మంత్రివర్గ సలహా మేరకే వ్యవహరించాలని, సవరణలు కోరే హక్కు మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2024 ఆగస్టు 14న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. కోదండరాం, అమేర్ అలీ ఖాన్లు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసుకోవడానికి అనుమతించింది. అయితే వారి నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తాజాగా బుధవారం జరిగిన వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వును సవరించింది. మధ్యంతర ఉత్తర్వు ఆధారంగా తీసుకున్న అన్ని చర్యలు, అందులో ప్రమాణ స్వీకారాలు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం జరిగే ఏ కొత్త నామినేషన్లు అయినా, సెప్టెంబర్ 17న జరిగే విచారణ తర్వాత వచ్చే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని తెలిపింది. కాగా గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సిఫారసు మేరకే గవర్నర్ ఆమోదం తెలిపారని వాదించారు. పిటిషనర్లు తమ నామినేషన్ల అమలును కాదు, గవర్నర్ తిరస్కరణను సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ పూర్తిగా రాజ్యాంగపరమైన విధానాన్నే అనుసరించారని చెప్పారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్ వాదించారు. గవర్నర్.. ‘హైకోర్టుకు నేనుజవాబు చెప్పాల్సిన అవసరం లేదు..’ అని చెప్పారని తెలియజేయగా, ‘చాలా దురదృష్టకరం’ అని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు.

ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి: బ.పంచమి ఉ.6.09 వరకు, తదుపరి షష్ఠి రా.3.51 వరకు; నక్షత్రం: రేవతి ప.11.44 వరకు, తదుపరి అశ్విని; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.49 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.52 వరకు; అమృత ఘడియలు: ఉ.9.26 నుండి 10.56 వరకు, తదుపరి రా.3.25 నుండి 4.55 వరకు.సూర్యోదయం : 5.45సూర్యాస్తమయం : 6.24రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు మందకొడిగా ఉంటాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.వృషభం..... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు.మిథునం..... మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం... ముఖ్యమైన పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత వరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.సింహం..... రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.కన్య.... దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.తుల.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.వృశ్చికం... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.ధనుస్సు... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.మకరం.... నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు,సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కుంభం... ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.మీనం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు.

ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్‌తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్‌తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్‌ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు.

భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్‌తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్‌లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్‌కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్‌ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్‌పింగ్‌తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు

ప్రజాస్వామ్యం ఖూనీ
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి.

నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి నీట మునిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగాయి. ఏపీ రాజధాని అమరావతి.. కృష్ణా నదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. కొండవీటి వాగు, పాలవాగు పొంగిపొర్లుతుంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కనుచూపుమేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు.వేల ఎకరాలు భూములు నీటమునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరుగుతోంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయ పాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఏం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాల నీటమునిగాయి.ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు.. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.నీట మునిగిన అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణంఅమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం చెరువులా మారిపోయింది.

టారిఫ్‌లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్‌పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్‌లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్‌లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్‌ల విధింపు భారత సానుకూల ఔట్‌లుక్‌ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్‌లు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్‌కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. కనుక భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది.

సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్‌కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్‌తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్‌పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్‌ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్‌కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్‌కు కొత్తగా మళ్లీ బెయిల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది.

మీరు నా మొదటి గురువు
‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్ దాదా’(1986). రాకేశ్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్ దాదా’ గా రజనీకాంత్ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది. ‘కూలీ, వార్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్ సార్.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు.
మనసు దోచే మయూరి గార్డెన్
కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌పై సెబీ వేటు
ఎందుకంత దూకుడు?
ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్
‘నీట్’ తొలి విడతలో 30,608 మందికి సీట్లు
టారిఫ్‌లు భారత్ వృద్ధిని ఆపలేవు
ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి
తెరపైకి నాలుగు ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్టులు
ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టతేది?
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
ఓట్ల చోరీ-విపక్షాల నిరసనలు
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బిక్షాటన చేస్తూ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ
మనసు దోచే మయూరి గార్డెన్
కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌పై సెబీ వేటు
ఎందుకంత దూకుడు?
ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్
‘నీట్’ తొలి విడతలో 30,608 మందికి సీట్లు
టారిఫ్‌లు భారత్ వృద్ధిని ఆపలేవు
ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి
తెరపైకి నాలుగు ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్టులు
ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టతేది?
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
ఓట్ల చోరీ-విపక్షాల నిరసనలు
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బిక్షాటన చేస్తూ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ
ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?
సినిమా

ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్‌తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.ది రాజాసాబ్‌లో నిధి..ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ప్రయాణించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025

పరదా కోసం రోడ్డెక్కిన స్టార్ హీరోయిన్!
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.తాజాగా తన మూవీ పరదా ప్రమోషన్స్‌ను రోటీన్‌కు భిన్నంగా నిర్వహించింది. వైజాగ్‌లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది. పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగుల పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి అంటూ కారులో నిలబడి తన మూవీని ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.Vizag ♥️ #paradha on August 22nd pic.twitter.com/mOY1Q5bIF6— Anupama Parameswaran (@anupamahere) August 12, 2025Actress Anupama Parameswaran markets her 22 August release #Paradha during her Andhra tour! pic.twitter.com/9RxeYvglMI— idlebrain jeevi (@idlebrainjeevi) August 12, 2025

నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దుఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తరలించడం జరగదు, చంపేస్తారా?తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ప్రోగ్రామ్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.మా జేబులో నుంచి తీస్తున్నాంజంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. లోలోపలే చచ్చిపోతున్నా..ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!

అవ్వ - బువ్వ.. ఏదీ తేల్చుకోలేకపోతున్నా: మంచు మనోజ్
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం. 20 మందిని తీసుకెళ్తా..రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్‌గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్‌కు, కూలీ మూవీ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. “Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025 చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు!
క్రీడలు

గెలిపించిన రాధ, యస్తిక
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడిన అనిక లియరాయిడ్ (90 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రాచెల్ ట్రెనమన్ (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో కెపె్టన్ రాధ యాదవ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది. వికెట్ కీపర్ యస్తిక భాటియా (70 బంతుల్లో 59; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), ధారా గుజ్జర్ (53 బంతుల్లో 31; 2 ఫోర్లు), రాఘ్వీ బిష్త్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. లూసీ హామిల్టన్, హేవార్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ రేపు జరుగుతుంది.

'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్‌మన్ గిల్‌ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్‌గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు?

Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు?
ఆసియాకప్-2025 టోర్నీకి సమయం అసన్నమవుతోంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. భారత క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది. అయితే ఈ 18 మంది సభ్యుల జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కడం కష్టమేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో అతడి కంటే మెరుగ్గా రాణించిన వికెట్ కీపర్లు ఉన్నారని ఆయన అన్నారు.కాగా గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజూ శాంసన్ టీ20ల్లో అదరగొట్టాడు. శాంసన్ 16 ఇన్నింగ్స్‌లలో 34.78 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కానీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై మాత్రం ఈ కేరళ ఆటగాడు బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి."సంజూ శాంసన్ ఇటీవల కాలంలో టీ20ల్లో అద్బుతంగా రాణించాడు. కానీ స్వదేశంలో ఇంగ్లండ్‌తో పూర్తి స్దాయి జట్టుతో ఆడినప్పుడు శాంసన్ ఇబ్బంది పడ్డాడు. సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ తమ ప్రధాన జట్టులో ఆడిన ఏకైక సిరీస్ అది. అక్కడ అతడు ఆకట్టుకోలేకపోయాడు. అతడు ఆసియాకప్‌నకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్‌గా అభిశర్మ ఎలానూ ఉంటాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నాను. అతడికి టీ20ల్లో మంచి రికార్డుతో పాటు అనుభవం ఉంది. ఇప్పుడు వికెట్ కీపర్ స్లాట్ కోసం జితేష్ శర్మ, సంజూ శాంసన్ల మధ్య పోటీ నెలకొంది. జితేష్‌కు మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉంది. అంతేకాకుండా అతడు మంచి ఫినిషింగ్ కూడా అందించగలడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున తన సత్తా ఎంటో జితేష్ చూపించాడు. ఒకవేళ శాంసన్ ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం కష్టమే" అని దాస్‌గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Aus vs SA: వేలు చూపిస్తూ ఓవరాక్షన్.. సౌతాఫ్రికా స్టార్‌కు షాకిచ్చిన ఐసీసీ
సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాకిచ్చింది. మంగళవారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తమ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనించనందుకు బాష్‌కు ఓ డీమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కర్బిన్ బాష్ అద్బుతమైన బంతితో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఔట్ చేసిన అనందంలో బాష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. బాష్ డ్వార్షుయిస్ వైపు వేలు చూపిస్తూ ఆడింది చాలు ఇక వెళ్లు అన్నట్లు సైగ చేశాడు.దీంతో అతడు ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘనకు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్‌ను ఔట్ చేసినప్పుడు బౌలర్లు సదరు బ్యాటర్‌ను కించపరిచే లేదా దుర్భలాషలడడం వంటి ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు కిందకు వస్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 53 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సఫారీలు సమం చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20కె యిర్న్స్ వేదికగా ఆగస్టు 16న జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్ గడ్డపై వేటకు సిద్దమవుతున్న కింగ్ కోహ్లి..
బిజినెస్

ఫ్రీ సర్వీస్.. మరి ఆదాయం ఎలా వస్తుంది?
పాలప్యాకెట్ నుంచి పిజా వరకు ఏం కొన్నాలన్నా ఫోన్‌తో క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. జేబులో రూపాయి లేకపోయినా యూపీఐ ద్వారా కావాల్సినవి కొనేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చాక ఆర్థిక లావాదేవీలు చకచకా జరిగిపోతున్నాయి. ఎటువంటి సర్వీసు చార్జి లేకుండానే చెల్లింపులు జరుగుతుండడంతో మనోళ్లు యూపీఐ సేవలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.రూపాయి నుంచి లక్ష వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి డిజిటల్ యాప్‌ల సేవలను యూపీఐ (UPI) కోసం ఎక్కువగా వాడుతున్నారు. వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండానే ఈ కంపెనీలు సర్వీస్ అందిస్తున్నాయి. నగదు లావాదేవీలపై ఎలాంటి చార్జీలు తీసుకోకుండా ఈ సంస్థలు ఎలా మనగలుగుతున్నాయి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఏవిధంగా ఆర్జిస్తున్నాయి? కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించాల్సిన అవసరం ఏముంది? ఈ కంపెనీలు నడపడానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేయకుండా, ఉత్పత్తులేవీ విక్రయించకుండా ఎలా సంపాదిస్తున్నాయి? ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యాప్‌లు ఏ ఉత్పత్తిని అమ్మకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే.. దానికి కారణం కస్టమర్ల నమ్మకం. నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. డిజిటల్ యాప్‌ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎక్కడికి పోవన్న భరోసాతోనే వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.స్పీకర్ సర్వీస్‌తో..డిజిటల్ యాప్‌ల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్- ఆపరేటింగ్ స్పీకర్ సర్వీస్ ద్వారా వస్తుంది. మనం దుకాణం నుండి వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసినప్పుడల్లా.. డబ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్‌ను కంపెనీ నెలకు రూ.100కి దుకాణదారులకు అద్దెకు ఇస్తుంది. మన దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా స్పీకర్లు దుకాణాలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏటా రూ.360 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి.స్క్రాచ్ కార్డులతో ఖుష్దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్‌బ్యాక్ లేదా కూపన్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలను జనాల్లోకి తీసుకెళుతున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులకు ఆయా బ్రాండ్లే సొమ్ములు చెల్లిస్తాయి. ఫలితంగా జీపే, ఫోన్‌పే (Phone pay) వంటి డిజిటల్ యాప్‌లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఒకవైపు కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, మరోపక్క బ్రాండ్ల ప్రమోషన్‌తో డిజిటల్ యాప్‌లు దూసుకుపోతున్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ విద్యార్థులుపెరుగుతున్న ఆదరణ తక్షణ నగదు లావాదేవీలు, బిల్లుల చెల్లింపుల పాటు వివిధ రకాల యూపీఐ సేవలను సులువుగా పొందే వీలుండడంతో ఉచిత డిజిటల్ యాప్‌లకు ఆదరణ ఎక్కువగా ఉంది. దీంతో మన దేశంలో ప్రతినెలా వేల కోట్లలో యూపీఐ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది.

ఐఐటీ హైదరాబాద్‌లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్‌లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.అన్ని విధాలా సిద్దంగా..ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.ఈ డ్రైవర్ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్‌బెడ్‌ను కూడా టిహాన్ నిర్మించింది.ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.

‘బంగారం’ పెట్టుబడులు భారీగా తగ్గాయ్..
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి జులైలో రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పెట్టుబడులు రూ.2,081 కోట్లతో పోల్చి చూస్తే ఏకంగా 40 శాతం తగ్గాయి. ఈ ఏడాది మే నెలలోనూ బంగారం ఈటీఎఫ్‌లు రూ.292 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.పసిడి ధరలు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.అంతకుముందు వరుసగా రెండు నెలల్లో.. ఏప్రిల్‌లో రూ.6 కోట్లు, మార్చిలో 77 కోట్ల చొప్పున గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,277 కోట్లుగా ఉన్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలోకి పసిడికి సైతం చోటు కల్పిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు రూ.67,634 కోట్లకు పెరిగాయి. జూన్ చివరికి ఉన్న రూ.64,777 కోట్లతో పోల్చి చూస్తే 4.4 శాతం వృద్ధి చెందాయి.78.69 లక్షల ఫోలియోలు గోల్డ్ ఈటీఎఫ్‌లలో మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతా) జూలై చివరికి 78.69 లక్షలకు చేరాయి. 2.15 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ‘బంగారం గత రెండేళ్లలో బలమైన పనితీరు చూపించినప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు కష్టమే. చాలా మంది ఇన్వెస్టర్లు హెడ్జింగ్ దృష్ట్యా బంగారానికి కొంత పెట్టుబడులు కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉన్న దృష్ట్యా అప్రమత్తత అవసరం’ అని జెర్మైట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ సూచించారు.స్థూల ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లలో అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్‌ఫోలియో వైవిధ్యం దృష్ట్యా బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్‌ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్‌లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్‌లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.ఏటా నిర్వహించే ఈ సేల్‌లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది.
ఫ్యామిలీ

అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంట గలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయను కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..!
నిమ్మరసం దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా ఎందుకు అమ్ముతుందో పాపం అనుకునేలోపు ఆశ్చర్యం కలిగించేలా ఆర్థిక పాఠాల గురించి బెబుతోంది ఆ చిన్నారి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారని కళ్లకుకట్టినట్లు చూపించే బెస్ట్ పేరెంటింగ్ పాఠం ఇది. సమాజానికి ఇలాంటి తలిదండ్రులే అవసరం అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఏడేళ్ల చిన్నారి ఒక వీధిలో నిమ్మరసం అమ్ముతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి తోపాటు అమ్మమ్మ, తండ్రి కూడా ఉన్నారు. దీన్ని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఘరత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కంటెంట్ క్రియేటర్ పూర్వ ఆ చిన్నారి ఇలా దుకాణం నడపడాన్ని గమనించి వారి అనుమతితోనే ఈ వీడియో తీస్తోంది. అసలు ఆ చిన్నారి ఇలా ఎందుకు చేస్తుందని ఆమె అమ్మమ్మను, తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా అని ప్రశ్నిస్తాడు. తన కూతురు ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొంది ఇలా వ్యాపారం మొదలు పెట్టిందని వివరిస్తాడు. ఆ పస్తకం నుంచి తెలుసుకున్నదాన్ని నేర్చుకునేలా ఇలా ఆచరణలో పెట్టించానని చెబుతాడు ఆ తండ్రి. అది విని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఇంత చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ గురించి నేరుకుంటుందా అని విస్తుపోతుందామె. ఇలాంటి తల్లిదండ్రేలే కదా సమాజానికి కావాలి అంటూ ఆ పేరెంట్స్‌ని చేసిన పనికి ప్రశంసిస్తుంది కంటెంట్ క్రియేటర్. కలలు కనడం, నిర్మించడ, తనను తాను నమ్మడం వంటివి ఆచరణలో పెట్టినప్పుడే తెలుస్తుందని చేతల ద్వారా బహుచక్కగా వివరించారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. గొప్ప తల్లిదండ్రులుగా ఉండటం అంటే ఇదే. కేవలం గ్రేడులు, మంచి మార్కులు కాదు..జీవిత పాఠాలు నేర్పించాలి, మనం లేకపోయినా..ఆ చిన్నారులు తమ జీవితాన్ని నిర్భయంగా లీడ్ చేయగల సామర్థ్యం పెంపొందించాలని అని నేర్పించే గొప్ప పేరెంటింగ్ పాఠం ఇది. ప్రతి తల్లిదండ్రలు తప్పక తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా కదూ..!. View this post on Instagram A post shared by Purva Gharat 👁️ (@purvagx) (చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులివే!
తెలుగు రాష్ట్రాల్లో 20 లోపే..జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ ఉత్పత్తులు: 17 ఉత్పత్తుల్లో 1 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 15 హస్తకళాకృతులు ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిల్‌గ్రీ, నిర్మల్ బొమ్మల – క్రాఫ్ట్, నిర్మల్ ఫర్చీచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీం, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, సిద్ధిపేట గొల్లభామ చేనేత చీరలు, నారాయణపేట చేనేత చీరలు, బనగానపల్లె మామిడి, ఆదిలాబాద్ డోక్ర, వరంగల్ దుర్రీస్, తాండూరు కంది.2004వ సంవత్సరంలో 3 భౌగోళిక గుర్తింపులతో భారత్ జీఐ ట్యాగ్ల నమోదు ప్రారరంభ మైంది. 2024లో ఇది 643కు చేరింది. 2023–24లో అత్యధికంగా జీఐ పొందిన హస్తకళాకృతులు 85 కాగా, వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 48. ఆహారోత్పత్తులు 19 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు: 19 ఉత్పత్తుల్లో 4 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 11 హస్తకళాకృతులు, 3 మానుఫ్యాక్చర్డ్–నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్, ఏపీ లెదర్ పప్పెట్రీ, ఉప్పాడ జాందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్న మిరప, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు– పాపడాలు, బందరు లడ్డు, ఉదయగిరి వుడెన్ కట్లెరీ, బనగానపల్లి మామిడి, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్, అరకు వ్యాలీ అరబిక కాఫీ.643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు2004–2024 మధ్యకాలంలో జీఐ గుర్తింపు పొందిన వాటిలో హస్తకళాకృతులు 54%, వ్యవసాయ ఉత్పత్తులు 31%, తయారీ, సహజ వస్తువులు 8%, ఆహారోత్పత్తులు 7% ఉన్నాయి. ఉత్తర భారత దేశానికి చెందిన జీఐ గుర్తింపు ఉన్న బాస్మతి బియ్యానికి అధిక ధర వస్తుంది, సాధారణ బాస్మతి బియ్యంతో పోల్చితే. అదేవిధంగా కేరళలో జీఐ గుర్తింపు ΄పొందిన దేశీ బియ్యం రకాల సాగుదారులకు అధికాదాయం వస్తోంది. మన దేశంలో గత 20 ఏళ్లలో మొత్తం 643 ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపులు పొందగా, అందులో 200 వ్యవసాయోత్పత్తులే. ఆహారోత్పత్తులు 47, హస్తకళాకృతులు 343, మానుఫ్యాక్చర్డ్, నేచురల్ గూడ్స్ 53 ఉన్నాయి. అత్యధిక జీఐలు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 74 (11.51%). ఇందులో ఎక్కువ భాగం హస్తకళాకృతులే. తమిళనాడులో జీఐ పొందిన 59 (9.18%) ఉత్పత్తుల్లో హస్తకళాకృతులు, ఆహారోత్పత్తులే ఎక్కువ. మహారాష్ట్రలో 49 (7.62%), కర్ణాటకలో 44 (6.84%), కేరళలో 35 (5.44%) వస్తువులకు 2024లో జీఐ లభించింది. గత 20 ఏళ్లలో దేశంలో 2024 నాటికి 643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో17 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకుజీఐ2017–23 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. 2017లో అత్యధికంగా జీఐల నమోదు జరిగింది. ఆ తర్వాత కాలంలో హస్తకళాకృతులు, వైన్స్, స్పిరిట్స్, సేవలు, తదితర అన్ని విభాగాల్లోనూ తగ్గుదల నమోదైంది. అయితే, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల సంఖ్య మాత్రం 2017–2023 మధ్య 23.9% పెరిగింది. ఈ కాలంలో జీఐ గుర్తింపు ΄÷ందిన వైన్స్, స్పిరిట్స్ 59.64% (5,28,832) ఉండగా, వ్యవసాయ ఉత్పత్తులు 3,37,008 (38.01%) ఉన్నాయి. హస్తకళాకృతులు 11,538 (1.3%) ఉన్నాయి. 2023లో అత్యధికంగా చైనా 9,785 జీఐలతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 763తో 49వ స్థానంలో, భారత్ 530తో 52వ స్థానంలో ఉంది. నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి, సాగుడి డెస్క్.

జీఐ ఉత్పత్తులు, ప్రాధాన్యత
విలక్షణత, వారసత్వ గుర్తింపు కలిగి ఉన్న విశిష్ట ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంటే బాగుంటుంది. ఆ గుర్తింపును బట్టి ఆ ఉత్పత్తి ఏ భౌగోళిక ప్రాంతానికి చెందినదో తెలుస్తుంది. తద్వారా ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందు కోసమే భౌగోళిక సూచిక (జాగ్రఫికల్ ఇండికేషన్స్–జీఐ..Geographical Indication (GI)లు కేటాయించే ప్రక్రియ అంతర్జాతీయంగా అమల్లో ఉంది. జీఐ ఉన్న ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. భారత్‌లో 2004 నుంచి జీఐల కేటాయింపు మొదలైంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన ఎక్కువగా ఉన్న అధికాదాయ, ఉన్నత మధ్యతరహా ఆదాయ దేశాల్లో ఎక్కువ జీఐలు నమోదవుతున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే వేల కొలదీ ఉత్పత్తులకు జీఐలు ఇచ్చాయి. జీఐ జాబితాలో వైన్స్, స్పిరిట్స్ది అగ్రస్థానం. తర్వాతే వ్యవసాయ, ఆహారోత్పత్తులు. 2024 నాటికి మన 643 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ తక్కువ. చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మన దేశంలో ఎక్కువగా జీఐ గుర్తింపు ΄పొందాయి. ఇతర రంగాల్లో విలక్షణ ఉత్పత్తులపై మనం ఇంకా దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ప్రాంతీయ వారసత్వ సుసంపన్నతను పరిరక్షించుకోవటానికి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి జీఐ గుర్తింపును సోపానంగా మార్చుకోవాలి. జీఐ గుర్తింపు ΄ పొందిన ఉత్పత్తులను ప్రధాన మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చే మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.. ఈ ఏఐ యుగంలో జీఐ లోకంలో అభివృద్ధి మార్గాలేమిటో తొంగి చూద్దాం రండి..! మేధో సంపత్తి (ఇంటల్లెక్చువల్ ప్రాపర్టీ– ఐపీ) హక్కులు అనేవి మానవ మేధస్సు నుంచి వెలువడే ఉత్పత్తులను, వాటి సృష్టికర్తల ప్రయోజనాలను కాపాడే ప్రపంచవ్యాప్త చట్టబద్ధత కలిగిన ఒక వ్యవస్థలో భాగం. ఈ మేధో ఆస్తులను ఉపయోగించుకునే హక్కు, నియంత్రించే హక్కు ఎవరికి ఉంది? ఎవరి నుంచి అనుమతి ఎలా పొందవచ్చో జీఐ తెలియజేస్తుంది. ట్రేడ్‌మార్క్‌లు, భౌగోళిక సూచికలు.. రెండూ ఐటెంటిఫయ్యర్లుగా, డిఫరెన్షియేషన్ టూల్స్‌గా పనిచేస్తాయి. ట్రేడ్‌మార్క్‌లు ఉత్పత్తి వ్యాపార మూలాన్ని సూచిస్తాయి. అయితే జీఐలు దాని భౌగోళిక మూలాన్ని సూచిస్తాయి. భౌగోళిక సూచికలు (జీఐలు) నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన ఉత్పత్తులకు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ఉత్పత్తుల ప్రత్యేక లక్షణాలను, వారసత్వాన్ని జీఐలు ఎత్తి చూపుతాయి. సాంప్రదాయ ఉత్పత్తులను రక్షించడానికి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, మార్కెట్లో ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి సాధనాలుగా పనిచేస్తున్నందున జీఐల ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వైన్లు, స్పిరిట్లు జీఐలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో జీఐ రంగంలో వ్యవసాయ వస్తువులు, హస్తకళల ఉత్పత్తులదే పైచేయి. భారతదేశ మేధో సంపత్తి చట్టం నాలుగో షెడ్యూల్ ప్రకారం, వస్తువులను 34 తరగతులుగా వర్గీకరించారు. దీనిలో 31వ తరగతి వ్యవసాయ, ఉద్యానవన, అటవీ ఉత్పత్తులు, ఇతర తరగతులలో చేర్చని ధాన్యాలు, జంతువులు, తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కలు, పువ్వులు, జంతువుల ఆహార పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు, మాల్ట్ ఉన్నాయి. పర్మిజియానో రెగ్జియానో, షాంపైన్ వంటి మద్యం ఉత్పత్తులతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) జీఐ వ్యవస్థలో ముందంజలో ఉంది. పూర్వం నుంచి ఫ్రాన్స్ ఇటలీ, స్పెయిన్ జీఐ ఉత్పత్తుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, చైనా, భారత్ వంటి దేశాలు జీఐలను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించటంలో, ఉపయోగించడంలో ఇటీవల కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. పెద్దగా ప్రసిద్ధి చెందని వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు ప్రపంచ ఖ్యాతిని తేవటంలో, ΄ోటీని పెంచటంలో జీఐలు ఉపయోగపడతాయి. వియత్నాం, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ప్రపంచ మార్కెట్లలో తమ ఉత్పత్తుల విలక్షణతను చాటి చెప్పటానికి జీఐలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. వియత్నాంలో స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి జీఐలు సానుకూలంగా దోహదపడ్డాయి. 1999 చట్టంతో శ్రీకారంప్రపంచవ్యాప్తంగా సమాజాల సాంస్కృతిక పరిరక్షణ, ఆర్థిక వృద్ధికి జీఐలు కీలకమైన సాధనాలుగా మారాయి. మన దేశ జీఐ ప్రయాణం భౌగోళిక వస్తువుల సూచికలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం– 1999తో ప్రారంభమైంది. ఇది 2004లో 20 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. మొదటి జీఐ ట్యాగ్ డార్జిలింగ్ టీకి లభించింది. అప్పటి నుండి భారతదేశం జీఐ రిజిస్ట్రేషన్లలో వేగవంతమైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా సాంప్రదాయ వస్తువులను రక్షించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెం΄÷ందించడం జీఐ ట్యాగ్ల ద్వారా కొంతమేరకు సాధ్యపడుతోంది. స్థానిక సమాజాలు తరచుగా పర్యావరణ అనుకూలమైన సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించటంపై దృష్టి సారించడంతో జీఐ గుర్తింపు అటువంటి ఉత్పత్తి పద్ధతులను వెలుగులోకి తెస్తోంది.సవాళ్లెన్నో..జీఐ వ్యవస్థకు ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఉత్పత్తిదారులు, వినియోగదారులలో జీఐలపై అవగాహన, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువగా ఉంది. జీఐలను నమోదు చేయడం, అమలు చేయడం సంక్లిష్టంగా ఉండటంతో పాటు ఇది ఖరీదైన వ్యవహారంగా మారిపోవటం చిన్న ఉత్పత్తిదారులకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ఆశావహ భవిష్యత్తు కూడా కనిపిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, సుస్థిరతను ప్రోత్సహించడంలో జీఐ పాత్రకు గుర్తింపు పెరుగుతోంది. అంతేకాకుండా, భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తుల ట్రేసబిలిటీ, ధృవీకరణను పెంపొందించడానికి డిజిటల్ టెక్నాలజీలను వాడుకుంటే.. అది మార్కెట్ విస్తరణకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.వాణిజ్య ఒప్పందాల్లో రక్షణ అవసరంమన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు పొందటంలో ముందంజలో ఉన్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చితే జీఐల నమోదు ప్రక్రియ మన దేశంలో ఊపందుకోలేదని చెప్పచ్చు. చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు సులువుగా అర్థమై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలిగేలా జీఐ ప్రక్రియను సరళీకృతం చేయాలన్న వాదన ఉంది. అయితే, జీఐ గుర్తింపు ఇవ్వటంతోనే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. రిజిస్ట్రేషన్ తర్వాత మద్దతు అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన ఒక విషయమేమిటంటే.. జీఐ గుర్తింపులు ΄ పొందటగుత్తాధిపత్యానికి దారితీసే పరిస్థితులను ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే, ఆ ధోరణి చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టదాయక పరిస్థితులకు దారితీసే ముప్పు ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో జీఐ ఉత్పత్తులకు తగిన రక్షణ ఉండేలా పాలకులు రక్షణాత్మక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లలో మన జీఐ ఉత్పత్తులు రాణించగలుగుతాయి. చిన్నస్థాయి ఉత్పత్తిదారుల సవాళ్లను అంతర్జాతీయ, జాతీయ శక్తులు పరిష్కరించి, సాంకేతిక అభివృద్ధిని జోడించినప్పుడే జీఐ ద్వారా ఆర్థికాభివృద్ధిని అందిపుచ్చుకోవటం సాధ్యమవుతుంది. ఆర్థికాభివృద్ధితో నాటు ప్రాంతీయ విలక్షణ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన మన సంప్రదాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రాభవం లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే ఔషధ గుణాలున్న దేశీ పంట ఉత్పత్తులకు జీఐ ఇచ్చి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే మన రైతులకు, దేశానికి మంచి ఆదాయం చేకూరుతుంది. -పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్.
ఫొటోలు
అంతర్జాతీయం

పాలస్తీనాకు ఆస్ట్రేలియా గుర్తింపు.. అయితే ఈ షరతులు వర్తింపు..
కాన్బెర్రా: త్వరతో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫ్రాన్స్, యూకే, కెనడాలున్నాయి.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోమవారం ఒక ప్రకటనలో సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆయా దేశాలకు మద్దతు పలికింది. అయితే ఆస్ట్రేలియా గుర్తింపు అనేది పాలస్తీనా అథారిటీ నుండి అందుకున్న నిర్దిష్ట హామీలపై ఆధారపడి ఉంటుందని అల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్‌ను పాలస్తీనా ప్రభుత్వం నుండి తొలగించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం మొదలైనవి ఉన్నాయి.గాజాలో మానవతా సంక్షోభంపై ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా అధికారులు గాజాలో కొనసాగుతున్న ఆకలి మంటలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల గాజాలో పెద్ద ఎత్తున సైనిక దాడికి ప్రణాళికలు వేయడాన్ని ఆస్ట్రేలియా ఖండించింది. మధ్యప్రాచ్యంలో హింసాయుత ఘటనలను విచ్ఛిన్నం చేయడానికి, గాజాలో సంఘర్షణలు, ఆకలిని అంతం చేయడానికి పాలస్తీనా దేశపు గుర్తింపు అనేది పరిష్కారం మార్గం అవుతుందని ప్రధాని అల్బనీస్ అన్నారు.

రతన్ టాటా ఏంటో అమెరికాకు తెలుసు! ఇవాళ ఆయన ఉండి ఉంటేనా..
భారత దేశ చరిత్రలో అహ్మదాబాద్ ఎయిరిండియా AI171 విమాన ప్రమాదంపై అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై అమెరికా న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ మధ్యాహ్నా సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కొద్దిసెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది.. కింద ఉన్న మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యంపై అమెరికాకు చెందిన న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా కంపెనీ మాజీ చైర్మన్, దివంగత రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారాయన. రతన్ గనుక ఉండి ఉంటే.. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవి కావని అన్నారాయన. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాకు రతన్ టాటా అంటే ఏంటో తెలుసు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల ఆయన కనబరిచే శ్రద్ధ, వాళ్ల బాగోగుల గురించి ఆయన చేసే ఆలోచనలు.. వీటి గురించి అమెరికా ప్రజలకు కూడా కొంత తెలుసు. ఒకవేళ ఆయన గనుక ఇవాళ ఉండి ఉంటే.. ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బాధితుల పట్ల దయగుణం కచ్చితంగా ప్రదర్శించేవారు’’ అని అన్నారాయన. ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం ఆండ్రూస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక బాధిత కుటుంబం దీనావస్థను ప్రస్తావిస్తూ.. వయసుపైబడి మంచాన ఉన్న ఓ తల్లి ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీదే ఆధారపడి బతుకుతోంది. అలాంటి కొడుకు ఎయిరిండియా ప్రమాదంలో మరణించాడు. ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదు. మరి ఇప్పుడు ఆమె వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారు? ఆమె పరిస్థితి ఏంటి? అని ఆండ్రూస్ అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ఓ ట్రస్ట్ నెలకొల్పి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిరిండియా ప్రతిజ్ఞ చేసింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌ను తిరిగి నిర్మిస్తామని పేర్కొంది. జులైలో.. తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలను ఎయిరిండియా విడుదల చేసింది. ఆ సొమ్మును 147 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు, విమానం కూలడంతో నేల మీద మరణించి మరో 19 కుటుంబాలకు పరిహారంగా అందజేశారు. ఈ సొమ్మును తుది పరిహారంలో మినహాయిస్తామని కూడా ప్రకటించారు. అయితే పరిహారం అందడంలో జాప్యంతో.. బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాయి.2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు సమర్పించింది. అందులో.. • ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు టేకాఫ్ తర్వాత సెకన్ పాటు ఆగిపోయాయి, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.• ఇంజిన్లు గాల్లోనే ఆగిపోవడం వల్ల విమానం కుప్పకూలింది.• 32 సెకన్లలోనే విమానం క్రాష్‌ల్యాండ్ అయింది.ఆ సమయంలో ఒక పైలట్ ఇంధనం ఎందుకు సిచ్ఛ్ ఆఫ్ చేశావని మరో పైలట్‌ను ప్రశ్నించాడు. నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడతను.మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా.. విమానం అప్పటికే కూలిపోయింది.విమాన ప్రమాదానికి FADEC (Full Authority Digital Engine Control) సిస్టమ్‌లో లోపం కారణమైతే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని లాయర్ మైక్ ఆండ్రూస్ తెలిపారు. అలాకాని పక్షంలో ఎయిరిండియాదే గనుక బాధ్యత అయితే.. మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రెండూ ఉన్నట్లు గనుక తేలితే.. అప్పుడు పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారయన.

నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్‌పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్‌కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్‌లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్‌జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్‌తోపాటు మరో నలుగురు జర్నలిస్టులు మరణించారు. ఈ దాడుల్లో కరస్పాండెంట్ మహ్మద్ క్రీకే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జహెర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలీవా, వారి సహాయకుడు మహ్మద్ నౌఫల్ మరణించినట్లు అల్‌జజీరా ధ్రువీకరించింది. అల్–షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గర్లో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం ఏడుగురు మరణించారని అల్–షిఫా ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. కాగా, అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు, అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘రెండు గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్‌ను అతని ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే, ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతును నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం’ . అని ఆ సందేశంలో పేర్కొన్నారు. అల్ షరీఫ్ హమాస్ నాయకుడు: ఐడీఎఫ్అయితే.. వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్.. హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడిఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు ఆయన నాయకత్వం వహించాడు’ అని ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ఒక ప్రకటనలో తెలిపింది. అల్ షరీఫ్‌పై ఇజ్రాయెల్ చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకురాలు ఐరీన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు.. ఫ్రంట్‌లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె గతంలోనే హెచ్చరించారు. ఖండించిన జర్నలిస్టు సంఘాలు.. జర్నలిస్టుల హత్యను పాలస్తీనా జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. వారు ఉగ్రవాదులు కాదని, అలా నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోడీ గిన్స్బర్గ్ తెలిపారు. ‘ప్రస్తుత యుద్ధంలోనే కాదు, గత దశాబ్దాల్లోనూ ఇజ్రాయెల్ నమూనా ఇది. జర్నలిస్టును చంపడం.. అతను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఇజ్రాయెల్ దళాలు పనిగట్టుకొని చేస్తున్నాయి’ అని ఆమె ఆరోపించారు.
జాతీయం

మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులంతా ఓ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని దౌసా-మనోహర్పూర్ రోడ్డులో ఆగి ఉన్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది భక్తులు ఖాఠుశ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు.. ఈప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సీఎం శర్మ.. ప్రమాద వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక, తమ వారిని కోల్పోయిన కారణంగా మృతుల కుటుంబ సభ్యలు కన్నీటిపర్యంతమవుతున్నారు. #WATCH | Dausa, Rajasthan | Visuals from Shri Ramkaran Joshi Hospital in Dausa, where people injured in the accident between a passenger pick-up and a trailer truck near Bapi have been brought for treatment. pic.twitter.com/0ytIMiV7T8— ANI (@ANI) August 13, 2025

30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్
కర్ణాటక: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒకరు స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చిచ్చు రేగింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు హత్య కేసులో ఇరుక్కున్నాడు.విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవర్ కాగా, విజయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువతిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ కల్లోలం రేపాడు. విజయ్ భార్య ఆశతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో విజయ్ తన కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధనంజయ ఎఫైర్ కొనసాగించడంతో పంచాయితీ పోలీసులకు వద్దకు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.మరోవైపు తన సంసారంలో నిప్పులు పోసిన ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అతడు అన్నంత పని చేస్తాడనే భయంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి విజయ్‌కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విజయ్‌కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్, అతడి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.∙

‘భారత్‌కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్ తాటాకు చప్పుళ్లు
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్‌కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. కాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్.. పాకిస్తాన్‌ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్‌బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్‌లో నిందితుడి అకౌంట్‌పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్‌ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్‌ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్‌గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025

తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
రామగిరి(నల్లగొండ): కన్న కూతురిపై అత్యాచారం జరగడానికి కారణమైన తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బీటీఎస్‌కు చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకొని, మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నంచగా తిరస్కరించింది. బలవంతంగా బాలిక దుస్తులు విప్పి వీడియోలు తీసి, శారీరకంగా అనుభవించాడు. శివకుమార్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బాధిత బాలిక 2023 మే 8న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లి యాదమ్మ, శివకుమార్‌పై ఫిర్యాదు చేసింది.పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోక్సో కోర్టు జడ్జి రోజారమణి మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ.. ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఏ1గా ఉన్న గ్యారాల శివకుమార్ ఉదయం కోర్టుకు వచ్చినట్లే వచ్చి పారిపోయాడు. అతడు కోర్టుకు గైర్హాజరైనట్లుగా న్యాయస్థానం ప్రకటించి దోషిగా తేలుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. తదుపరి కోర్టు ముందు హాజరుపర్చిన రోజు శిక్షను ఖరారు చేయడం జరుగుతుంది. ఏ2 యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. పదేళ్లు జైలు శిక్ష.. రామగిరి(నల్లగొండ), మర్రిగూడ: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన పోలె నరేష్ 2016 ఆగస్టు 22న అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ కె. బలరాం పోలె నరేష్‌పై పోక్సో కేసు నమోదు చేయగా.. అప్పటి నాంపల్లి సీఐ బాలగంగిరెడ్డి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా జడ్జి రోజారమణి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కారు డ్రైవర్‌కు..కట్టంగూర్: ప్రమాదంలో కారుతో మహిళను ఢీకొని ఆమె మృతికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమనా విధిస్తూ నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 మార్చి 18న శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన బట్టా సుమన్ తన బంధువైన మందుల పరిమళను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామం నుంచి అయిటిపాములలో శుభకార్యానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో చెర్వుఅన్నారం క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా వేపకుంట గ్రామానికి చెందిన కారు డ్రైవర్ అంగోతు కిశోర్‌కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో అజాగ్రత్తగా, అతివేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మందుల పరిమళ తలకు తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమన్ తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు తుది తీర్పులో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్ఐ తెలిపారు. అత్యాచారం కేసులో 20 ఏళ్లు..రామగిరి(నల్లగొండ): మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన వీరంశెట్టి సాంబశివ 2017 ఏప్రిల్ 15న అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలైన బాలికను ఇంట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రోజారమణి నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరించడంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులుగా జె. రవీందర్, ఏ. రమేష్‌బాబు, జె. శివకుమార్ వ్యవహరించారు.

రాత్రిళ్లు నగ్నంగా వీడియో కాల్స్.. వీఆర్‌కు ఎస్ఐ రాజశేఖర్
పుట్టపర్తి టౌన్/ ముదిగుబ్బ: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన ‘పట్నం’ ఎస్ఐ రాజశేఖర్‌పై వేటు పడింది. పోలీసు స్టేషన్‌కు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న అతను అమాయక గిరిజన మహిళను వేధించడంతో వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రత్న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన ఓ గిరిజన మహిళలను లైంగికంగా వేధించిన రాజశేఖర్ గురించి ‘సాక్షి’ మంగళవారం ‘నాతో వస్తే ఓకే... లేదంటే ఇబ్బంది పడతావ్..’ శీర్షికన వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే అతన్ని వీఆర్‌కు పంపారు. అలాగే ఎస్ఐ రాజశేఖర్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని సంబం«ధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నం ఎస్ఐగా జయరాంనాయక్ ‘పట్నం’ ఎస్ఐగా కె. జయరాంనాయక్‌ను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. దీంతో మంగళవారమే ఆయన బాధ్యతలను చేపట్టారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇప్పటి వరకూ పట్నం ఎస్ఐగా ఉన్న రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపిన ఎస్పీ రత్నం..ఆయన స్థానంలో వీఆర్‌లో ఉన్న జయరాంనాయక్‌ను నియమించారు. నాతో వస్తే ఓకే.. లేదంటే ఇబ్బందిపడతావ్..

30 ఏళ్ల స్నేహం.. చిచ్చు రేపిన ఎఫైర్
కర్ణాటక: వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. 30 ఏళ్ల స్నేహం వారిది. అందులో ఒకరు స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో చిచ్చు రేగింది. ఫలితంగా ఇద్దరు మిత్రుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు హత్య కేసులో ఇరుక్కున్నాడు.విజయ్ కుమార్, ధనంజయ అలియాస్ జే మూడు దశాబ్దాలకు పైగా స్నేహితులు. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో కలిసి పెరిగారు. తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. ధనంజయ ఆటోడ్రైవర్ కాగా, విజయ్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం ఆశ అనే యువతిని వివాహం చేసుకుని, కామాక్షిపాల్యలో కాపురం పెట్టాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో ధనంజయ కల్లోలం రేపాడు. విజయ్ భార్య ఆశతో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో విజయ్ తన కాపురాన్ని కడబగెరె సమీపంలోని మాచోహళ్లికి మార్చాడు. అయినా ఆశతో ధనంజయ ఎఫైర్ కొనసాగించడంతో పంచాయితీ పోలీసులకు వద్దకు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పి పంపించారు.మరోవైపు తన సంసారంలో నిప్పులు పోసిన ధనంజయ్‌ని చంపేస్తానని విజయ్‌కుమార్ చెప్పుకుని తిరుగుతుండేవాడు. అతడు అన్నంత పని చేస్తాడనే భయంతో విజయ్‌కుమార్‌ని హత్య చేయాలని ధనంజయ స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి విజయ్‌కుమార్ ఇంట్లోంచి బయటకు రాగానే తన గ్యాంగ్‌తో కలిసి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశాడు. మాదనాయకనహళ్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విజయ్‌కుమార్ భార్య ఆశను అదుపులోకి తీసుకున్నారు. ధనంజయ్, అతడి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.∙