
ముంబై: దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చేలా వెసులుబాటు కల్పించే కీలక నిర్ణయాన్ని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెలువరించింది. కార్పొరేట్ బాండ్లలో ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులపై ఇప్పటి వరకూ ఉన్న 20 శాతం పరిమితిని తొలగించింది.
ఇండియన్ కార్పొరేట్ రుణ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వివరించింది.