RBI Website Crashed After Withdrawing Rs 2000 Notes From Circulation - Sakshi
Sakshi News home page

RBI Website Crash: దెబ్బకు ఆర్‌బీఐ వెబ్‌సైట్ క్రాష్.. కారణం ఇదే!

Published Fri, May 19 2023 9:04 PM | Last Updated on Fri, May 19 2023 9:16 PM

RBI website crashed after withdrawing rs 2000 notes - Sakshi

Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల చాలామని ఉండదని తాజాగా ప్రకటించిన కొంత సమయంలో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకోవడంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది.

2016లో ప్రధానమంత్రి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృతమైంది.

దేశంలో బ్లాక్ మనీ తగ్గించడానికి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. అయితే వాటి ముద్రణ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయింది. 2018 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల మొత్తం విలువ సుమారు రూ. 6.73 లక్షల కోట్లని సమాచారం.

ప్రస్తుతం RBI వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. కావున రెండు వేల రూపాయలు కలిగి ఉన్న ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement