న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పలు కీలక చర్యలు చేపట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.57,128కోట్ల డివిడెండ్‌ను ఆమోదించింది. శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించారు. బ్యాంక్‌ల పనితీరుపై ఆర్‌బీఐ అధికారులు అధ్యయనం చేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు బీ.పీ.కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రాతా పాట్రా, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబసీష్ పాండా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటుపై దృష్టి సారించాలని ఆర్‌బీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment