బన్రూట్టి సమీపాన రోడ్డుపై రిజర్వు బ్యాంకు వేలం వేసిన నగదు కనిపించింది.
టీనగర్: బన్రూట్టి సమీపాన రోడ్డుపై రిజర్వు బ్యాంకు వేలం వేసిన నగదు కనిపించింది. బన్రూట్టి సమీపంలోగల కొగుచ్చిపాళయం గ్రామంలో సోమవారం రాత్రి కత్తిరించిన స్థితిలో కరెన్సీ కట్టలు కనిపించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని చిరిగిపోయిన నోట్లకట్టలను చూశారు. అంతేగాకుండా కొగుచ్చిపాళయంలో ఇంటింటికీ వెళ్లి విచారణ జరిపారు. అక్కడున్న సామిల్లు వద్దకు వెళ్లి విచారణ జరిపారు. దీనిగురించి మిల్లు నిర్వాహకులు పోలీసులతో మాట్లాడుతూ పుదుచ్చేరిలో కొయ్యదుంగలు కోసే సామిల్లు ఉందని, ఈ మిల్లు యజమాని చెన్నై రిజర్వు బ్యాంకు నుంచి చిరిగిపోయిన కరెన్సీ నోట్లను వేలం వేసి తీసుకువస్తారని, తర్వాత వీటిని తమకు విక్రయిస్తారని తెలిపారు.
తాము అతని నుంచి మూడు లారీల్లో 10 టన్నుల చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ముక్కలు ముక్కలుగా కత్తిరించి రంపపు పొట్టుతోపాటు హోటళ్లకు, టీ దుకాణాలకు విక్రయిస్తామన్నారు. ఈ పొట్టు బాగా మండడంతో తమ వద్ద అనేక మంది దీన్ని తీసుకువెళతారన్నారు. ఆయుధపూజ సందర్భంగా మిల్లును శుభ్రం చేస్తూ వచ్చామని, ఆ సమయంలో ఒక బస్తాతో కరెన్సీ మాయమైందని, రోడ్డు పక్కన దీన్ని ఎవరు పారేశారో తెలియలేదన్నారు.