హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులు ఆన్‌లైన్‌లో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే పాన్ లేదా ఫామ్ 60లను అప్‌డేట్ చేయని ఎస్‌బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్‌బీఐ డీయాక్టివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment