EMV chip
-
బాబూ తాళాలు ఎక్కడ?
-
జనవరి 1 నుంచి పాత ఎస్బీఐ కార్డులు పనిచేయవు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్బీఐ ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్ స్ట్రిప్ డెబిట్ కార్డ్, పాత కార్డ్‌ల స్థానంలో ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత డెబిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులు ఆన్లైన్లో కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బ్యాంకు తెలియజేసింది. ఇప్పటికే పాన్ లేదా ఫామ్ 60లను అప్డేట్ చేయని ఎస్బీఐ ఖాతాదారుల కార్డ్‌లను ఎస్బీఐ డీయాక్టివేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్బీఐ
ముంబై: ఈఎంవీ చిప్ ఆధారిత కార్డుల జారీ తుది గడువు 2018 డిసెంబర్‌గానే కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదని బ్యాంకులకు నిర్దేశించింది. దీనిగురించి మరింత తెలుసుకోవాలంటే... మీ దగ్గర ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఒక్కసారి పరిశీలించండి. దానిమీద నల్లని స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంటుంది. దీనిని మ్యాగ్నటిక్ స్ట్రిప్ అని అంటారు. మీ అకౌంట్ వివరాలు, బ్యాంకింగ్ ఆర్థిక అంశాలు అన్నీ ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తోనే అనుసంధానమై ఉంటాయి. అయితే ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో పాటు దీనికన్నా ఇంకా అధిక భద్రతా ప్రమాణాలతో కూడిన ఈఎంవీ చిప్‌లను కలిగి ఉన్న కార్డులూ ప్రస్తుతం జారీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తోపాటు తప్పనిసరిగా ఈఎంవీ చిప్ ఉన్న కార్డులనూ జారీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈఎంవీ చిప్, పిన్(ఏ లావాదేవీ జరిపినా పిన్ జారీ, ఆధారిత చెల్లింపులు) ఆధారిత కార్డులు మోసపూరిత ఆర్థిక లావాదేవీల నివారణలో గణనీయంగా దోహదపడతాయని ఆర్బీఐ పేర్కొంది.