ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్‌బీఐ | Adhere to timeline on EMV chip based cards: RBI to banks | Sakshi
Sakshi News home page

ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్‌బీఐ

Published Fri, Sep 16 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్‌బీఐ

ఈఎంవీ చిప్ కార్డుల జారీ గడువు పొడిగించం: ఆర్‌బీఐ

ముంబై: ఈఎంవీ చిప్ ఆధారిత  కార్డుల జారీ తుది గడువు 2018 డిసెంబర్‌గానే కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదని బ్యాంకులకు నిర్దేశించింది. దీనిగురించి మరింత తెలుసుకోవాలంటే... మీ దగ్గర ఉన్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఒక్కసారి పరిశీలించండి. దానిమీద నల్లని స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంటుంది. దీనిని మ్యాగ్నటిక్ స్ట్రిప్ అని అంటారు. మీ అకౌంట్ వివరాలు, బ్యాంకింగ్ ఆర్థిక అంశాలు అన్నీ ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తోనే అనుసంధానమై ఉంటాయి.

అయితే ఈ మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో పాటు దీనికన్నా ఇంకా అధిక భద్రతా ప్రమాణాలతో కూడిన ఈఎంవీ చిప్‌లను కలిగి ఉన్న కార్డులూ ప్రస్తుతం జారీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తోపాటు తప్పనిసరిగా ఈఎంవీ చిప్ ఉన్న  కార్డులనూ జారీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  ఈఎంవీ చిప్, పిన్(ఏ లావాదేవీ జరిపినా పిన్ జారీ, ఆధారిత చెల్లింపులు) ఆధారిత కార్డులు మోసపూరిత ఆర్థిక లావాదేవీల నివారణలో గణనీయంగా దోహదపడతాయని ఆర్‌బీఐ  పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement