
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) సహా బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్ సమావేశం చర్చించింది.
గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా బోర్డ్‌లోని పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ మొదటివారంలో మరోసారి బోర్డ్ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది,. పేటీఎం లాంటి ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఉండాలన్న కేంద్రం ఆలోచనను ఆర్‌బీఐ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.